Advertisement
News

ఉగాది పచ్చడితో కరోనా కి చెక్ పెట్టండి

అందరూ ఇంట్లోనే ఉండి భక్తి శ్రద్దలతో ఇష్ట దైవాన్ని పూజించుకుని ఆ పరమేశ్వర ప్రసాదమైన కమ్మనైన ఉగాది పచ్చడిని స్వీకరించి ప్రకృతి పండుగ ఉగాది పర్వదినాన్ని ఆయు ఆరోగ్యాలతో జరుపుకోవాలని నా టీవీ తెలుగు కోరుతోంది.

నా టీవీ తెలుగు ప్రేక్షకులకు “శార్వరి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మృత్యువు కాటేసే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. కావున అందరూ ఇంటిపట్టునే ఉండి ఉగాది పండుగను జరుపుకోవాలని మరొక్కసారి నా టీవీ తెలుగు మనవి చేస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే… ఉగాది పచ్చడి అంటేనే ఎన్నో ఔషధగుణాల కలయిక, మనం ఉన్న పరిస్థితి కి కరెక్ట్ సింక్ అయ్యే పండుగ ఉగాది. సో… అందరూ కాస్త ఎక్కువ పచ్చడిని లాగించేయ్యండి, రోగనిరోధక శక్తి తో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేయండి. అటు సైన్స్ పరంగా చూసినా, ఇటు ఆధ్యాత్మికంగా చూసినా ఉగాది పచ్చడి కీలక పాత్ర పోషిస్తుంది.

Advertisement

ఉగాది రోజున ఏం చెయ్యాలి

ఒళ్ళంతా సున్నిపిండితో నలుగుపెట్టుకుని, వేడినీళ్ళతో, షాంపూ లు కాకుండా ప్రకృతి ప్రసాదమైన కుంకుడు రసం తో తలంటుకుని స్నానం చెయ్యండి, శుభ్రంగా తుడుచుకున్న తరవాత సాంబ్రాణి వేసుకుని, కొత్తబట్టలు కట్టుకుని మీ ఇష్ట దైవాన్ని పూజించుకోండి. ప్రకృతి ప్రసాదం షడ్రుచుల ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి ఆరగించండి. టీవీ లో వచ్చే పంచాంగ శ్రవణాన్ని విని మీ మీ రాశిఫలాని తెలుసుకోండి. ఏమైనా దోషాలుంటే పూజలు చేయించుకోండి.

Article inline ad #1

ఉగాది పచ్చడికి అవసరమైన పదార్ధాలు

వేపపువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి కాయ, చెరకు ముక్కలు, ఉప్పు, అరటిపండు, మిరపకాయలు (కాస్త కారం తక్కువగా ఉన్నవి వాడండి)

ఈ షడ్రుచులు ఏం సూచిస్తాయి

వేపపువ్వు విచారాన్ని, కొత్త బెల్లం సంతోషాన్ని, మిరపకాయలు (కారం) కోపాన్ని, మామిడి కాయ ఆశ్చర్యాన్ని, ఉప్పు భయాన్ని సూచిస్తాయని మన పూర్వీకులు చెపుతారు.

ఎలా చెయ్యాలి

వేపపూవ్వు నుంచి రేకులు వేరుచేసి, కొత్త చింతపండుని నీటిలో నానబెట్టి గుజ్జు గా చేసుకోవాలి, మామిడి కాయలు, చెరకు, మిరపకాయలు, అరటి పండు లను చిన్న చిన్న ముక్కలు గా కోసుకోవాలి. ఇప్పుడు కొత్త చింతపండు గుజ్జులో వేప రేకులు, మామిడి కాయ ముక్కలు, చెరకు ముక్కలు లేదా రసం కానీ, మిరపకాయలు ముక్కలు, అరటి పండు ముక్కలు అన్ని కలిపి, చివరికి తగినంత ఉప్పువేసి కలుపుకోవాలి. అంతే… షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.. ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టి లాగించేయ్యండి.

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

దయచేసి మర్చిపోకండి… మీ సహాయ సహకారాలు మాకు అందించండి…
కృతఙ్ఞతలు… మీ తురగా పవన్ చంద్

అందరూ నా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, మీ తోడ్పాటుని అందించండి, మీకు దగ్గరలో ఏం జరిగినా ఆ వార్తలని ఫోటోలను, వీడియో లను నా టీవీ కి పంపండి, ప్రతి ఒక్కరూ “నా టీవీ తెలుగు” కుటుంబంలో భాగస్వాములు అవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.

mail id : [email protected]

మీ తురగా పవన్ చంద్
naatv telugu youtube channel

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close