Entertainment

పవర్ స్టార్ సినిమా ట్రైలర్

ట్రైలర్ చూడాలంటే రూ.25/- డబ్బులు కట్టాల్సిందే అంటున్న వర్మ. అవును మీరు చదివింది నిజమే. వర్మ విడుదల చేస్తున్న పవర్ స్టార్ సినిమా ట్రైలర్ చూడటానికి వ్యూ కి రూ.25/- పెట్టాడు. ప్రపంచం లోనే మొదటిసారిగా ట్రైలర్ కి డబ్బులు పెట్టిన వ్యక్తిగా వర్మ చరిత్ర సృష్టించుకున్నాడు.

Advertisement
  • విడుదలకి సిద్ధంగా ఉన్న పవర్ స్టార్, థ్రిల్లర్, మర్డర్ సినిమాలు
  • జులై 22 ఉదయం 11 గంటలకు పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్న వర్మ
  • పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే రూ.25/- చెల్లించాలట
  • జులై 25 న పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేస్తున్న వర్మ

వర్మ ఏం చేసినా వివాదం తో కూడుకున్న క్రియేటివిటీ అనే పిచ్చిని తన స్టైల్ లో జనాల మీద రుద్దుతూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మకి రోజు రోజుకీ పిచ్చి ముదురుతోంది అంటున్నారు కొంతమంది. మరికొంతమంది వర్మ మామూలోడు కాదు అంటారు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అంతుబట్టదు. లాక్ డౌన్ లో సినిమాలు ఎలా తియ్యాలా అని అందరూ తలలు పట్టుకు కూర్చుంటే వర్మ మాత్రం సినిమాల మీద సినిమాలు తీసేస్తున్నాడు. అవి బూతు సినిమాలే అనుకోండి. ఆలా తీయడం ఇలా తన వెబ్ సైట్ లో పెట్టేయడం జరిగిపోతున్నాయి.

ఇది కూడా చదవండి : వేశ్య పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

జులై 22 న ఉదయం 11 గంటలకు పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాడు వర్మ. -Turaga Pavan Chand

ప్రస్తుతానికి థ్రిల్లర్, పవర్ స్టార్, మర్డర్ సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. వీటిల్లో పవర్ స్టార్ సినిమా అయితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తీస్తున్నాడన్న సంగతి చిన్న పిల్లాణ్ణి అడిగిన తెలిసిపోతుంది. పవర్ స్టార్ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసి పవన్ ని, అయన అభిమానుల్ని గ్యాప్ లేకుండా రెచ్చగొడుతున్నాడు. పవర్ స్టార్ సినిమా పోస్టర్లు ఓ రేంజ్ లో అలరిస్తున్నాయి. 

పవర్ స్టార్ సినిమాలో బండ్ల గణేష్ పాత్రని పోషిస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో పవన్ భార్యలు, రాజకీయం, చిరంజీవి, నాగబాబు చుట్టూ తిప్పుతున్నాడు. ఎన్నికల ఫలితాల తరవాత కథ అంటూ టాగ్ లైన్ పెట్టాడు. –Turaga Pavan Chand

అయితే ట్రైలర్ చూడాలంటే రూ.25/- ఛార్జ్ చేస్తున్నాడు. ఇదేంట్రా బాబు ట్రైలర్ కి ఎవడైనా డబ్బులు వసూలు చేస్తారా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకైతే ప్రపంచంలో ట్రైలర్ కి డబ్బులు పెట్టిన వ్యక్తి మాత్రం వర్మనే. ఇదిలా ఉంటే పవర్ స్టార్ సినిమాని పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా రిలీజైన జులై 25 న పవర్ స్టార్ సినిమా రిలీజ్ చెయ్యటం ఆసక్తికరం.

జులై 25 న వర్మ తన www.rgvworldtheatre.com లో పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు. -Turaga Pavan Chand

#powerstar #rgv #ramgopalvarma #naatvtelugu #rgvworldtheatre #powerstartrailer

నా టీవీ తెలుగుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతఙ్ఞతలు.
మా నా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని కూడా ఓ సారి చూసేయండి. నచ్చితే సబ్ స్క్రైబ్ చేసేయండి. Click here: NaaTV Telugu

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close