News

క్వారంటైన్ సెంటర్ లో బాలికపై అత్యాచారం

కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులకు ప్లేస్ తో పనిలేదు, వయసు తో పనిలేదు, ఆడదైతే చాలు, అత్యాచారం చేసేయడమే పని...

Advertisement

కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే, ఓ ప్రబుద్దుడు మాత్రం కామంతో అల్లాడుతున్నాడు. రోజు రోజుకీ మనుషులమన్న సంగతి మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. ఆరేళ్ళ పాప దగ్గరనుంచి అరవై ఏళ్ళ ముసలమ్మా దాక ఎవరిని వదలడంలేదు కామాంధులు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరిని కాటేస్తారో తెలియటంలేదు. మానవత్వం తలదించుకునే సంఘటన ఢిల్లీ క్వారంటైన్ సెంటర్ లో జరిగింది.

కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులకు ప్లేస్ తో పనిలేదు, వయసు తో పనిలేదు, ఆడదైతే చాలు, అత్యాచారం చేసేయడమే పని… – Turaga Pavan Chand

 


కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం అందరికి తెలిసిందే. 15 ఏళ్ళ అమ్మాయికి కరోనా రావటం తో ఢిల్లీ లోని క్వారంటైన్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే క్వారంటైన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ఓ యువకుడు (20) ఈ అమ్మాయిమీద కన్నేశాడు. కామంతో కళ్ళుమూసుకుపోయిన ఈ యువకుడు కాపుకాసి అర్ధరాత్రి అమ్మాయి బాత్రూం కి వెళ్ళినప్పుడు, బాత్ రూమ్ లోనే స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసాడు. ఈ సంఘటన ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి చత్తార్‌పూర్‌లో ఉన్న సర్దార్ పటేల్ క్వారంటైన్ లో కేంద్రంలోజరిగింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు.

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close