Friday, February 20, 2026
#
HomeHealth & FitnessEat Too Much Protein: ప్రోటీన్ ఎక్కువగా తినడం ప్రమాదకరమా?

Eat Too Much Protein: ప్రోటీన్ ఎక్కువగా తినడం ప్రమాదకరమా?

Eat Too Much Protein: మన ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. కండరాలు పెరగాలన్నా, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం నిగనిగలాడాలన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరంలో జరిగే చాలా పనులకు ప్రోటీన్ కావాలి. కానీ, కొంతమందికి ఒక సందేహం వస్తుంటుంది. “మంచిది కదా అని ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఏమైనా ప్రమాదమా?” అని. దాని గురించి ఇప్పుడు సరదాగా మాట్లాడుకుందాం.

మీ బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి? Eat Too Much Protein – How much protein does your body need?

మీకు ఎంత ప్రోటీన్ కావాలో చెప్పాలంటే, అది మీ బరువు, వయసు, మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది.

  • సాధారణంగా, ఒక ఆరోగ్యవంతుడికి ప్రతి 1 కేజీ బరువుకి 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంటే, మీరు 60 కేజీల బరువు ఉంటే, రోజుకి సుమారు 48 గ్రాముల ప్రోటీన్ కావాలి.
  • కానీ, మీరు వ్యాయామం ఎక్కువగా చేస్తుంటే, లేదా కండలు పెంచాలనుకుంటే, మీకు ఇంకా ఎక్కువ ప్రోటీన్ అవసరం. అప్పుడు ప్రతి 1 కేజీ బరువుకి 1.2 నుంచి 2 గ్రాముల ప్రోటీన్ వరకు తీసుకోవచ్చు.
  • గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, వయసు మీద పడినవారికి ఇంకా ఎక్కువ ప్రోటీన్ అవసరం.

ఎక్కువ ప్రోటీన్ తింటే ప్రమాదమా? Is it dangerous to eat too much protein?

చాలామందికి కొన్ని భయాలు ఉన్నాయి. “ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీలు దెబ్బ తింటాయట”, “గుండెకు మంచిది కాదట”, “ఎముకలు బలహీనపడతాయట” అని. కానీ, ఈ భయాలు చాలా వరకు నిజం కాదు. దీనిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

  • గుండె జబ్బులు: ఎక్కువ ప్రోటీన్ తింటే గుండెకు ప్రమాదం అనే భయం ఉంది. కానీ, దీనిపై చేసిన చాలా పరిశోధనల్లో, గుండె జబ్బులకి ప్రోటీన్‌కి ఎలాంటి సంబంధం లేదని తేలింది.
  • ఎముకల ఆరోగ్యం: పాత అధ్యయనాలు ఏమో కానీ, కొత్త పరిశోధనలు మాత్రం ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎముకలు ఇంకా గట్టిపడతాయని చెబుతున్నాయి. ఎందుకంటే, మన ఎముకల్లో మూడో వంతు ప్రోటీన్‌తోనే తయారవుతుంది.

అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు (ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలు) ఉన్నప్పుడు మాత్రం ప్రోటీన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు డాక్టర్‌ని సంప్రదించి, ఆయన సలహా ప్రకారం ప్రోటీన్ తీసుకోవాలి.

మొత్తానికి చెప్పాలంటే, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదు. అయితే, మీరు తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండటం ముఖ్యం.

ఏ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ పవర్ హౌస్‌లు (Protein Power House) ఏంటో తెలుసా? (Eat Too Much Protein)

మన బ్రేక్‌ఫాస్ట్‌లో రోజూ కనిపించేవి కోడిగుడ్లు. ఇవి చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ, ప్రోటీన్ విషయంలో మాత్రం డైనమైట్! ఉడకబెట్టి తిన్నా, ఆమ్లెట్ వేసుకున్నా, బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌లో గుడ్డు ఉన్నదంటే, ఇక ఆ రోజుకి కావలసిన శక్తిని మీ జేబులో వేసుకున్నట్టే. కోడిగుడ్డుని శక్తి అంత గొప్పది మరి!

ఇక నాన్-వెజ్ ప్రియుల కోసం (Eat Too Much Protein):

  • చికెన్ బ్రెస్ట్: ఇది ఫైటర్స్ ఫుడ్. కొవ్వు తక్కువ, ప్రోటీన్ ఎక్కువ.
  • చేపలు: ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ప్రోటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దండిగా దొరుకుతాయి. ఇవి మన మెదడుకి చాలా మంచివి.
  • రొయ్యలు: తక్కువ క్యాలరీలతో ఎక్కువ ప్రోటీన్ కావాలంటే రొయ్యలు బెస్ట్ ఆప్షన్.

మరి, వెజిటేరియన్లు ఏం చేయాలి? అయ్యో, వాళ్ళు బెంగపడక్కర్లేదు. మాంసాహారంతో పోటీపడే శాఖాహార ప్రోటీన్ ఫుడ్స్ చాలా ఉన్నాయి.

  • పప్పులు: కందిపప్పు, పెసరపప్పు, శనగలు… ఇలా ఏ పప్పు తీసుకున్నా అది ప్రోటీన్ గని లాంటిదే.
  • సోయాబీన్స్: వీటిని “శాఖాహారుల మాంసం” అని పిలుస్తారు. అంత ప్రోటీన్ ఉంటుంది ఇందులో.
  • పాలు, పెరుగు, పనీర్: ఇవి మన ఎముకలకి బలం ఇవ్వడమే కాదు, మంచి ప్రోటీన్ కూడా అందిస్తాయి. పాలు తాగితే బలం వస్తుందని చిన్నప్పుడు మన పెద్దలు చెప్పింది నిజమే కదా!
  • వేరుశనగలు: వేరుశనగ గుళ్ళు ఒక ప్యాకెట్ తీసుకుని తింటే టైమ్ పాస్ అవ్వడమే కాదు, శరీరానికి కావలసిన ప్రోటీన్ కూడా లభిస్తుంది.
  • గుమ్మడి గింజలు, చియా సీడ్స్: ఇవి చిన్నవే అయినా, ప్రోటీన్ ప్యాక్డ్ సీడ్స్. వీటిని స్నాక్స్‌లా తిన్నా, సలాడ్స్‌లో వేసుకున్నా చాలా మంచిది.

గుర్తుంచుకోండి, కేవలం ప్రోటీన్ ఉన్నవి మాత్రమే కాకుండా, అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, అప్పుడు ఏ రోగమైనా మన దరికి చేరడానికి భయపడుతుంది. మన బాడీ పవర్ హౌస్ లా ఉండాలంటే, ఎం తినాలి? ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాను. 


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments