Eating Stale Roti: కొన్నిసార్లు, రాత్రి పూట వేడిగా ఉన్న చపాతీలు ఎక్కువ తింటాం, కానీ కొన్ని మిగిలిపోతుంటాయి. వాటిని పడేయలేక, ఫ్రిజ్‌లో పెట్టేసి ఉదయం తినేద్దాం అనుకుంటాం. మరికొంతమంది అయితే, అలవాటుగా రాత్రి చేసిన చపాతీలను ఉదయం టిఫిన్‌గా తింటుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి ఎన్నో సందేహాలు, అపోహలు! కొందరు “చాలా మంచిది” అంటే, మరికొందరు “అసలు తినకూడదు” అని అంటారు. అసలు నిజం ఏంటో సరదాగా, సైంటిఫిక్‌గా ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి మిగిలిన చపాతీలు: లాభాలు (Eating Stale Roti – Benefits of eating stale Roti)
రాత్రి మిగిలిపోయిన చపాతీలను ‘స్టేల్ చపాతీ‘ అని అంటారు. ఇవి ఉదయం తినడానికి చాలామంది ఇష్టపడతారు. దీని వెనుక కొన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఆశ్చర్యంగా అనిపించినా, కొన్ని పరిస్థితుల్లో ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
1. బ్లడ్ షుగర్ కంట్రోల్ (Controlling Blood Sugar Levels)
డయాబెటిస్ ఉన్నవారికి ఇది నిజంగా ఒక మంచి వార్త! రాత్రి మిగిలిపోయిన చపాతీలు తింటే రక్తం గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చల్లబడిన చపాతీలలో రెసిస్టెంట్ స్టార్చ్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. అందుకే, డయాబెటిస్ రోగులకు ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు.
2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది (Improves Digestion)
అజీర్తి, మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి చల్లని చపాతీలు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి. వీటిలో సహజంగా ఉండే డైటరీ ఫైబర్ మరియు జీర్ణ ఎంజైమ్‌లు కడుపు ఆరోగ్యానికి తోడ్పడతాయి. రాత్రి మిగిలిపోయిన చపాతీలను ఉదయం తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి, కడుపు తేలికగా ఉంటుంది.
3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది (Boosts Immunity)
నిపుణుల ప్రకారం, చల్లబడిన చపాతీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయట. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది.చద్ది చపాతీలను తినేటప్పుడు మళ్ళీ వేడి చేయకూడదు. అలా చేస్తే వాటిలో ఉండే ప్రీబయోటిక్స్ నశించిపోతాయి. అందుకే, నేరుగా కానీ, చల్లని పాలల్లో ముంచుకుని కానీ తినాలి.
4. బరువు తగ్గడానికి సాయపడుతుంది (Aids in Weight Loss)
బరువు తగ్గాలని కష్టపడుతున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. చల్లబడిన చపాతీలలో కార్బోహైడ్రేట్లు మరియు కలొరీలు తగ్గుతాయి. ఇవి తక్కువ కేలరీలతో ఎక్కువ ఫైబర్ ఇస్తాయి. కాబట్టి వీటిని తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది, తద్వారా అనవసరంగా ఎక్కువ తినడం తగ్గుతుంది.
5. కండరాలకు శక్తినిస్తుంది (Strengthens Muscles)
రాత్రి మిగిలిపోయిన చపాతీలలో కండరాలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతారు. ముఖ్యంగా వ్యాయామం చేసేవారు ఉదయం వీటిని పాలతో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
రాత్రి మిగిలిన చపాతీలు తింటే కలిగే నష్టాలు (Eating Stale Roti – Disadvantages of eating stale chapatis)
1. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం (Risk of Food Poisoning)
చపాతీలు ఎంత మంచివి అయినా, ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల వాటిపై బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. వాతావరణం వేడిగా ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. చపాతీలు నిల్వ ఉండటం వల్ల ఒరిజినల్ టేస్ట్ ఉండదు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి కడుపు నొప్పి, వాంతులు అవ్వచ్చు.
2. రుచిలో మార్పు (Change in Taste and Texture)
తాజాగా చేసిన చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి. కానీ రాత్రి మిగిలిన చపాతీలు గట్టిగా ఉంటాయి, వాటి సహజ ఉండే టేస్ట్ ఉండదు. చాలామందికి ఇది నచ్చకపోవచ్చు.
కీలకమైన చిట్కాలు (Key Tips of Eating Stale Roti)
రాత్రి మిగిలిపోయిన చపాతీలను తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
- చపాతీలను గాలి ఆడని డబ్బాలో (airtight container) పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.
- ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉంచిన చపాతీలను తినడం మానుకోవాలి.
- చద్ది చపాతీలు తినే ముందు బూజు కానీ (mold), ఫంగస్ కానీ చెడిపోయిన వాసనగని వస్తుందేమో అని చెక్ చేసుకుని తినాలి.
- ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
ముగింపు: మిగిలిపోయిన చపాతీలను తినడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. చపాతీలు వేస్ట్ ఐపోతాయని అనారోగ్యం పలు అవ్వకండి.
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


