Thammudu OTT: భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైన నితిన్ సినిమా ‘తమ్ముడు’ పెద్దగా మెప్పించలేకపోయిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు థియేటర్లో మిస్ అయినవాళ్ల కోసం గుడ్ న్యూస్. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి (Netflix) (August 1) వచ్చేసింది. ఇక ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు.
‘తమ్ముడు‘ కథేంటంటే.. (Thammudu OTT – Thammudu Movie Story)
తల్లిని కోల్పోయిన జై కి (నితిన్–Nithiin) అన్నీ తన అక్క స్నేహలత నే (లయ-Laya). కానీ, జై చేసిన ఓ పని వల్ల స్నేహలత ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో కోపంతో జైని దూరం పెడుతుంది. కొన్నేళ్లు గడిచాక, జై పెద్దవాడై ఆర్చ్‌రీలో మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ, అక్క జ్ఞాపకాలు తరచూ గుర్తొచ్చి గోల్డ్ మెడల్ సాధించలేకపోతుంటాడు.
ఇంతలో, అడవిలో స్నేహలత ఓ ప్రమాదంలో చిక్కుకుందని తెలుసుకుని, ఆమెను కాపాడటానికి జై బయలుదేరతాడు. మరి ఈ ప్రయాణంలో తమ్ముడు తన అక్కను కాపాడగలిగాడా? తన అక్క కోసం ఏమేం త్యాగాలు చేశాడు? అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.
సినిమా ఎలా ఉందంటే.. (Thammudu OTT)
నిజానికి, అక్కాచెల్లెళ్ళ అనుబంధం అనే మంచి పాయింట్ ఉన్నప్పటికీ, కథనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఫైట్లు ఎక్కువగా ఉండడం వల్ల కథనం అంతగా పండలేదనే చెప్పాలి. వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), లయ (Laya), సప్తమి గౌడ (Sapthami Gowda) వంటి నటీనటుల పాత్రలు బాగానే ఉన్నా, దర్శకుడు వాటిని సరిగా ఉపయోగించుకోలేదన్న ఫీలింగ్ కలుగుతుంది. అయినా, ఒకసారి ఓటీటీలో టైమ్ పాస్ కోసం చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు.
“తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.



