Thursday, February 19, 2026
#
HomeCinema3BHK OTT: కుటుంబ క‌థా చిత్రం ఓటీటీకి వచ్చేసింది

3BHK OTT: కుటుంబ క‌థా చిత్రం ఓటీటీకి వచ్చేసింది

3BHK OTT:వరుస విజయాలతో దూసుకుపోతున్న సిద్ధార్థ్, శరత్ కుమార్ కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 3BHK ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. గత నెలలో థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఇంటిల్లిపాదీ చూసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon PrimeVideo), సింప్లీ సౌత్ (SimplySouth) ఓటీటీలలో (OTT) అందుబాటులోకి వచ్చింది.

సినిమా కథేంటి?

సొంత ఇల్లు అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి కేవలం గూడు మాత్రమే కాదు, అది ఒక గౌరవం. ఆ గౌరవం కోసం ఒక కుటుంబం పడే పాట్లు, ఎదుర్కొనే సవాళ్లే ఈ సినిమా కథ. తల్లిదండ్రుల త్యాగం, కొడుకు బాధ్యత, పెళ్లి, ప్రేమ… ఇలాంటి ఎన్నో భావోద్వేగాలను దర్శకుడు శ్రీ గణేష్ చాలా హృద్యంగా చూపించారు. సినిమా కాస్త నెమ్మదిగా సాగినా, మధ్యతరగతి జీవితాలను అద్దం పట్టేలా ఉంటుంది.

హైలైట్స్ ఏంటి?

  • సిద్ధార్థ్ (Siddharth), శరత్ కుమార్ (SarathKumar) నటన అద్భుతంగా ఉంది.
  • దేవయాని (Devayani), మీతా రఘునాథ్ (Meetha Raghunath),  చైత్ర ఆచార్ (Chaithra J. Achar), యోగి బాబు (Yogi Babu) తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
  • అమృత్ రామ్‌నాథ్ సంగీతం ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చింది.
  • కుటుంబ విలువలు, కష్టాలు, సంతోషాలు… ఇలాంటి ఎన్నో భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించారు.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్ళు, మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సినిమా చూడాలనుకునేవాళ్ళు తప్పకుండా చూడండి. ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.

  • “తెలుగు వార్తలు, సినిమా అప్‌డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
  • నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.

📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments