ICICI Bank Minimum Balance: కొన్ని రోజులుగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న ఒక విషయం గురించి చాలా మందిలో గందరగోళం ఉంది. అదేమిటంటే, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఇటీవల తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం ప్రకారం, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్‌లో(Savings Account) కనీస బ్యాలెన్స్ (minimum balance) పరిమితిని భారీగా పెంచింది. ఈ విషయం చాలా మంది కస్టమర్లలో ఆందోళన కలిగించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయం ఏమిటి? (ICICI Bank Minimum Balance)
ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం, వేర్వేరు ప్రాంతాల వారికి కనీస బ్యాలెన్స్ పరిమితులు ఇలా ఉన్నాయి:
- మెట్రో, పట్టణ ప్రాంతాలు: గతంలో నెలకు రూ.10,000 ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.50,000కి పెంచారు.
- సెమీ-అర్బన్ ప్రాంతాలు: గతంలో రూ.5,000 ఉండగా, ఇప్పుడు రూ.25,000కి పెంచారు.
- గ్రామీణ ప్రాంతాలు: గతంలో రూ.5,000 ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.10,000కి పెంచారు.
ఒకవేళ మీ అకౌంట్లో ఈ కనీస బ్యాలెన్స్ లేకపోతే, తక్కువగా ఉన్న మొత్తానికి 6 శాతం లేదా గరిష్టంగా రూ.500 వరకు పెనాల్టీ విధిస్తారు. అయితే, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA), జన్ ధన్ అకౌంట్స్‌కు ఈ నిబంధనలు వర్తించవు. వాటికి కనీస బ్యాలెన్స్ అవసరం లేదు.
క్యాష్ డిపాజిట్లు (ICICI Bank Cash Deposits), విత్‌డ్రాయల్స్ (ICICI Bank Withdrawls) నిబంధనలు కూడా మార్చారు:
బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయడం (డిపాజిట్), తీయడం (విత్‌డ్రా)కు సంబంధించి కూడా ఐసీఐసీఐ బ్యాంక్ కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది.
- ఒక నెలలో మూడు సార్లు ఉచితంగా డబ్బులు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మూడు సార్ల మొత్తం పరిమితి రూ.1 లక్ష.
- ఒకవేళ రూ.1 లక్ష పరిమితి దాటితే, ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.150 లేదా ప్రతి రూ.1,000కి రూ.3.5 చొప్పున (ఏది ఎక్కువైతే అది) ఛార్జ్ పడుతుంది.
- ఇతరులు మీ అకౌంట్లో డబ్బులు వేసే థర్డ్-పార్టీ ట్రాన్సాక్షన్స్‌పై రూ.25,000 పరిమితి ఉంది.
- బ్యాంక్ పనివేళలు కానప్పుడు (సాయంత్రం 4:30 నుండి ఉదయం 9:00 వరకు) లేదా సెలవు రోజుల్లో క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా రూ.10,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, సాధారణ ఛార్జీలతో పాటు, ప్రతి లావాదేవీకి అదనంగా రూ.50 వసూలు చేస్తారు.
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ – జాగ్రత్త: సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు!:
సైబర్ నేరగాళ్లు రకరకాల కొత్త పద్ధతులతో మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు నాట్వీతెలుగు.కామ్ నడుం బిగించింది.
అప్రమత్తంగా ఉండండి! సురక్షితంగా ఉండండి!
ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు? (RBI Governor Reacted on ICICI Bank Minimum Balance)
ఈ నిర్ణయం తరువాత చాలా మందిలో ఇతర బ్యాంకులు కూడా ఇదే దారిలో వెళ్తాయేమోనని భయం మొదలైంది. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (RBI Governor Sanjay Malhotra) స్పందించారు. గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ పరిమితిని నిర్ణయించడం అనేది ఆయా బ్యాంకుల ఇష్టం” అని స్పష్టం చేశారు. దీనిపై ఆర్బీఐ ఎలాంటి నియంత్రణ పెట్టదని పరోక్షంగా తెలిపారు.
దీనితో, భవిష్యత్తులో ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీ బ్యాంక్ అకౌంట్లోని కనీస బ్యాలెన్స్ గురించి మీరు ఎప్పుడైనా గమనిస్తున్నారా?
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


