Friday, February 20, 2026
#
HomeHealth & FitnessStrong Bones: మీ ఎముకలు బలంగా ఉండాలంటే

Strong Bones: మీ ఎముకలు బలంగా ఉండాలంటే

Strong Bones:మన శరీరం నిటారుగా ఉండాలన్నా, కదలాలన్నా, నిలబడాలన్నా మన ఎముకలు చాలా ముఖ్యం. ఎముకలు దృఢంగా ఉండాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, మరికొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి. అయితే మన ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అలవాట్లకి దూరంగా ఉండండి (Stay away from these habits for Strong Bones):

  • సోడా, కాఫీ, కూల్‌డ్రింక్స్ తగ్గించండి: ఎక్కువగా సోడా, కాఫీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సోడాలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ మన శరీరంలో కాల్షియం చేరకుండా అడ్డుకుంటుంది. అలాగే, కాఫీలో ఉండే కెఫిన్ వల్ల యూరిన్ ద్వారా కాల్షియం బయటకు పోతుంది. వీటి బదులు పాలు, హెర్బల్ టీ లేదా నిమ్మరసం తాగడం మంచిది.
  • స్మోకింగ్, ఆల్కహాల్ మానేయండి: స్మోకింగ్ వల్ల ఎముకలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఆల్కహాల్ ఎక్కువ తాగితే శరీరంలో కాల్షియం తగ్గుతుంది. ఈ రెండు అలవాట్లు ఎముకలను బలహీనపరిచి ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.
  • ఎక్కువ స్వీట్స్ వద్దు: స్వీట్స్, చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం కాల్షియంను వేగంగా ఉపయోగించుకుంటుంది. దీనివల్ల మన శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. అందుకే స్వీట్స్ తగ్గించి, వాటి బదులు బెల్లం తీసుకోవడం ఆరోగ్యకరం.
  • ఉప్పు వాడకం తగ్గించండి: ఎక్కువ ఉప్పు తింటే మన శరీరంలో నుంచి కాల్షియం బయటకు పోతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని తగ్గించి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినండి.

సైబర్ ఫ్రాడ్ అలర్ట్ – జాగ్రత్త: సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు!:

సైబర్ నేరగాళ్లు రకరకాల కొత్త పద్ధతులతో మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు నాటీవీతెలుగు.కామ్ నడుం బిగించింది.

అప్రమత్తంగా ఉండండి! సురక్షితంగా ఉండండి!

ఎముకల బలానికి ఈ అలవాట్లు చేసుకోండి (Adopt these habits for Healthy & Strong Bones):

  • ఎండలో ఉండండి: మన శరీరానికి విటమిన్-డి చాలా అవసరం. విటమిన్-డి కాల్షియంను శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి విటమిన్-డి లభిస్తుంది. కాబట్టి రోజుకు 10-20 నిమిషాలు ఉదయం లేదా సాయంత్రం ఎండలో ఉండటం మంచిది.
  • రోజూ నడవండి: ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఎముకలు దృఢంగా ఉండాలంటే వాటిపై కొంత ఒత్తిడి ఉండాలి. కాబట్టి ప్రతి గంటకు ఒకసారి లేచి నడవడం వల్ల ఎముకల సాంద్రత (bone density) తగ్గుకుండా ఉంటుంది.
  • బరువు తగ్గించుకోండి: అధిక బరువు ఉన్నవారిలో ఎముకల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
  • ప్రోటీన్ ఫుడ్స్ తినండి: చాలామంది ఎముకల కోసం కాల్షియంపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ ఎముకలు బలంగా ఉండాలంటే ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్-కే కూడా అవసరం. అందుకే పాలు, పెరుగు, పనీర్, నట్స్, బ్రకోలీ వంటివి మీ ఆహారంలో చేర్చుకోండి.

ఈ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మీ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా (Bone Health) ఉంటాయి.

ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయో చెప్తారా?


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments