Thursday, February 19, 2026
#
HomeHealth & FitnessBenefits of Bad Habits: మంచి చేసే చెడు అలవాట్లు

Benefits of Bad Habits: మంచి చేసే చెడు అలవాట్లు

Benefits of Bad Habits: చిన్నప్పటి నుంచీ మన పెద్దవాళ్ళు “ఇది చెడు అలవాటు, అది చేయకూడదు, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండు, ఆలా ఉండు” అని చెబుతూనే ఉంటారు. కానీ, మనం ‘చెడు అలవాట్లు’ అని అనుకునే కొన్ని విషయాలు మనకు అంతో ఇంతో మంచి చేస్తాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సాధారణంగా ‘తప్పు‘ అని అనుకునే కొన్ని అలవాట్ల గురించి, వాటి వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీ ఆరోగ్యం, సృజనాత్మకత, మరియు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి: ఏ అలవాటైనా అతిగా ఉంటే నష్టమే. అని మంచి అలవాటైనా సరే. మనం ఇక్కడ మాట్లాడుకునే అలవాట్లు ఒక పరిమితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. ఆశ్చర్యపరిచే 15 Bad Habits with Benefits తెలుసుకుందాం. మీరు చదివాక – “అరె! చెడు కూడా మంచికే?” అని ఆశ్చర్యపోతారు.

చెడు అలవాట్లు కూడా మనకి మంచే చేస్తాయా? (Benefits of Bad Habits – Can bad habits even do us good?)

కొన్ని అలవాట్లు బయటకి “చెడ్డవి” అనిపించినా… వాస్తవానికి అవే మనకి మంచి ఫలితాలు ఇస్తాయి. “బ్యాడ్ హ్యాబిట్స్” అంటే విన్న వెంటనే మనకి మైనస్ ఫీలింగ్ వస్తుంది. ఉదయం ఆలస్యంగా లేవడం, గోళ్లు కొరుక్కోవడం, రూమ్ అంత గందరగోళంగా ఉంచడం లాంటివి అన్నీ చెడు అలవాట్లే అని అంటారు.

ఇప్పుడు అలాంటి 15 Bad Habits గురించి చూద్దాం. (Benefits of Bad Habits)

1. Daydreaming – పగటి కలలు కనడం

  • టైమ్ వేస్ట్ లా అనిపించినా, ఇది క్రియేటివిటీని పెంచుతుంది.
  • కొత్త ఐడియాలు, సొల్యూషన్స్ మన ఊహల్లోనే మొదలవుతాయి.

2. Overthinking – ఎక్కువగా ఆలోచించడం

  • ఎక్కువ ఆలోచించడం వల్ల మనకి ఒత్తిడి పెరుగుతుంది అనుకుంటారు.
  • కానీ కొన్ని సందర్భాల్లో ఇది సమస్యలకు డీటైల్ సొల్యూషన్ ఇస్తుంది.

3. Procrastination – వాయిదా వేయడం

  • “రేపు చేద్దాం” అనడం చెడ్డ అలవాటు.
  • కానీ కొన్నిసార్లు ఆలస్యం చేయడం వల్ల మంచి ఐడియాలు రావచ్చు.

4. Complaining – ఫిర్యాదు చేయడం / గొణగటం

  • ఎవరూ కంప్లయింట్స్ చేయడాన్ని ఇష్టపడరు.
  • కానీ సరైన సందర్భంలో కంప్లయింట్ వల్ల పాజిటివ్ మార్పు వస్తుంది.

5. Playing Games / Social Media

  • ఎక్కువైతే టైమ్ వేస్ట్.
  • కానీ మితంగా వాడితే ఫోకస్, రియాక్షన్ టైమ్ మెరుగుపడుతుంది.

6. Chewing Gum – గమ్ నమలడం

  • చాలామందికి చిన్న పిల్లల అలవాటు లా అనిపిస్తుంది.
  • కానీ గమ్ నమలడం వల్ల మెమరీ, కన్సన్‌ట్రేషన్ పెరుగుతుంది.

7. Nail Biting – గోళ్లు కొరుక్కోవడం

  • తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుపడతారు.
  • కానీ చిన్న వయసులో గోళ్లు కొరికేవాళ్లకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది అని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి.

8. Fidgeting – చేతులు, కాళ్లతో ఆడుకోవడం

  • బయటకి చూసే వాళ్లకి విసుగుగా అనిపిస్తుంది.
  • కానీ ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, దీర్ఘకాలం కూర్చోవడం వల్ల వచ్చే నష్టం తగ్గుతుంది.

9. Swearing – బూతులు తిట్టడం

  • ఇది మానర్స్ కి విరుద్ధం.
  • కానీ కోపం వచ్చినప్పుడు తిట్టడం వల్ల స్ట్రెస్ రిలీజ్ అవుతుంది.

10. Messy Desk – చిందరవందరగా

  • క్లీన్గా ఉంచకపోవడం చెడు అలవాటు.
  • కానీ Messy Desk ఉన్నవాళ్లలో Out-of-the-Box ఐడియాస్ ఎక్కువగా వస్తాయి.

11. Doodling – అర్థంలేని గీతలు గీయడం

  • క్లాస్‌లో డూడ్లింగ్ చేస్తే “వినడం లేదు” అని అనుకుంటారు.
  • కానీ ఇది మైండ్ యాక్టివ్‌గా ఉంచుతుంది, Concentration పెరుగుతుంది.

12. Sleeping Late – రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం

  • నైట్ జాగారం హెల్త్‌కి మైనస్.
  • కానీ క్రియేటివిటీ ఎక్కువగా రావచ్చు అని స్టడీస్ చూపిస్తున్నాయి.

13. Talking to Yourself – మనతో మనమే మాట్లాడుకోవడం

  • బయటకి చూస్తే వింతగా అనిపిస్తుంది. మెంటల్ గాడు అనుకుంటారు.
  • కానీ ఇది సెల్ఫ్ మోటివేషన్ టెక్నిక్.

14. Loud Music – బిగ్గరగా మ్యూజిక్ వినడం

  • ఎక్కువైతే చెవులు పాడవుతాయి.
  • కానీ కొన్నిసార్లు ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది, ఎనర్జీ ఇస్తుంది.

15. Skipping Showers – ప్రతిరోజు స్నానం చేయకపోవడం

  • వింతగా అనిపిస్తుంది.
  • కానీ చర్మం మీద ఉన్న నేచురల్ ఆయిల్స్, బ్యాక్టీరియా ప్రొటెక్షన్ లేయర్ లా పనిచేస్తాయి.

చివరగా (Conclusion – Benefits of Bad Habits)

మనకి చెడ్డవి అనిపించే అలవాట్లు అన్నీ తప్పనిసరిగా నష్టమే చేయవు. వీటిలో చాలా మితంగా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి.

అయితే జాగ్రత్తగా గుర్తుంచుకోండి (Benefits of Bad Habits):

  • ఏ అలవాటు అయినా అతిగా చేస్తే హాని అవుతుంది.
  • కానీ బ్యాలెన్స్ ఉంచితే – చెడులా కనిపించే అలవాట్లు కూడా మనకి మంచే చేస్తాయి.

“మీరు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని భావిస్తున్నాం, “ఈ సమాచారం మీకు నచ్చితే”, “అందరికి ఉపయోగపడాలి అని మీరు భావిస్తే”, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు “షేర్ చెయ్యండి”. మమ్మల్ని ప్రోత్సహించండి.”


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments