News

విజయవాడలో కలకలం, కర్ఫ్యూ

చుట్టుముడుతున్న కరోనా ... ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కబళించేస్తుంది...

Advertisement

విజయవాడలో 5 పాజిటివ్ కేసులు బయటపడటంతో, భవానీపురం, పాట రాజేశ్వరీ పేట లలో కర్ఫ్యూ విధించారు. ఎట్టిపరిస్థితుల్లో కర్ఫ్యూ సడలించమని అధికారులు ఖరాఖండిగా చెప్పేసారు. నిజాముద్దీన్ ఘటన తో దేశం మొత్తం ఉలిక్కి పడింది. అక్కడికి వెళ్ళొచ్చినవారు కరోనా పాజిటివ్ తో మృత్యువాత పడుతున్నారు. భవానీపురం లో కూడా అక్కడికి వెళ్లొచ్చిన ఒకతను, అతని తల్లితండ్రులు కూడా కరోనా పాజిటివ్ తో చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబంతో సంబంధం ఉన్న అందరిని పరీక్షించి, క్వారంటైన్ కి పంపించారు.

అందరికి చెప్పేది ఒక్కటే…

ఏదో ఒక వంక పెట్టి బయటకి రాకండి, కూరలు లేకపోతె పచ్చడేసుకుని తినండి, ఉన్నదాంతో సరిపెట్టుకోండి, మాస్కులు ధరించండి, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకి వెళితే అదే దుస్తులతో ఇంట్లోకి రాకండి, ఎందుకంటె, మీ దుస్తులమీద కరోనా ఉండచ్చు, వేడి నీటి తో స్నానం చెయ్యండి, కరోనా నన్నేం చెయ్యలేదని భరోసా వీడండి. ఇంట్లో ఒకరికి వస్తే ఇంటిల్లిపాదికీ వస్తుందని గుర్తించండి. మీతో పాటు మీ ఇంట్లోని వారు బాధపడతారు, మీ ఇంట్లో చిన్నపిల్లలు, గర్భవతులు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. వచ్చిన తరవాత చేసేది ఏంలేదు బాధపడటం తప్ప…

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

naatv telugu youtube channel
Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close