News

ఉరి ఎప్పుడు?

నిర్భయ కేసులో రోజుకో ట్విస్ట్

Advertisement

మెడికల్ స్టూడెంట్ నిర్భయని డిసెంబర్ 16, 2012 న ఢిల్లీలో అర్ధరాత్రి బస్సులో తిప్పుతూ అత్యంత దారుణం గా చిత్రహింసలకు గురిచేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మృతువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది. నిర్భయ నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. అయితే. ఉరి శిక్ష నుంచి తప్పించుకోడానికి రోజుకో పథకం పన్నుతున్నారు మృగాళ్లు. ఒకరి తరువాత ఒకరుగా క్షమాభిక్ష పిటిషన్ లు పెడుతూ చట్టం లోని లొసుగులు యుపయోగించుకుంటూ కాలయాపన చేయిస్తున్నారు. దాంతో చట్టం దుర్వినియోగం అవుతోందని కేంద్రం హై కోర్ట్ లో పిటిషన్ వేసింది. వాదనలను విన్న కోర్ట్ తీర్పుని రిజర్వు చేసింది. మరోవైపు నిందితుల న్యాయవాది వాదన మరోలా ఉంది. ఉరి తీయాలని తాపత్రయపడుతున్నారని, వారు పల్లెటూళ్లనుంచి ఢిల్లీకి వలస వచ్చిన దళితులని, వారిని ఎలా బాలి చేస్తారని ప్రశ్నించారు. కానీ, దేశం మొత్తం నిర్భయ నిందితులని ఎప్పుడు ఉరి తీస్తారా అని ఏంటో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఆడపిల్లలు బయట తిరగాలంటే భయమేస్తోంది, ఇలాంటి కామాంధులని ఉపేక్షించి తప్పుచేస్తున్నారని, చట్టాలు అడ్డుపెట్టి కాపాడుతున్నారని వాదన వినిపిస్తోంది. అత్యంత పాశవికం గా గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని ఇన్ని రోజులు ప్రాణాలతో ఉంచటమే తప్పని ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఏమవుతుందో అని కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు దేశ ప్రజలు.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close