Thursday, February 19, 2026
#
HomeCinemaDetective Ujjwalan OTT Release: 'డిటెక్టివ్ ఉజ్వలన్' తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Detective Ujjwalan OTT Release: ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Detective Ujjwalan OTT Release: మలయాళంలో మంచి హిట్ అయిన ఒక క్రేజీ మూవీ గురించి చెప్పడానికి వచ్చేశా! దాని పేరు ‘డిటెక్టివ్ ఉజ్వలన్’. ఈ మిస్టరీ కామెడీ థ్రిల్లర్, థియేటర్లలో అదరగొట్టి, ఇప్పుడు OTTలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం వెర్షన్ చూసి నిరాశపడిన తెలుగు ప్రేక్షకుల కోసం, ఈ మూవీ తెలుగులోకి కూడా డబ్ అయ్యి రాబోతోంది. ఇది నిజంగా ఓ మంచి శుభవార్తే కదా!

ద్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటించిన ఈ సినిమాని ఇంద్రనీల్ గోపాలకృష్ణన్ మరియు రాహుల్ డైరెక్ట్ చేసారు. కథ కొత్తగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి, ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మలయాళంలో సూపర్ సక్సెస్ అయ్యాక, ఇప్పుడు తెలుగులో కూడా ఆడియన్స్‌ని మెప్పించడానికి సిద్ధమవుతోంది. మరి డిటెక్టివ్ ఉజ్వలన్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ చూద్దామా?

OTT రిలీజ్ డేట్ & స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ (Detective Ujjwalan OTT Release)

మలయాళ మూవీ సూపర్ హిట్ మూవీ అయిన ‘డిటెక్టివ్ ఉజ్వలన్’  Lionsgate Play లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ రెడీ అవుతోంది.  అదీ మన తెలుగులో భాషలో,  ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి.

డిటెక్టివ్ ఉజ్వలన్: కథ, నటీనటులు, హైలైట్స్ (Detective Ujjwalan OTT Release)

కథ చాలా స్పెషల్‌గా ఉంటుంది. 1960ల తర్వాత కేరళలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఎలాంటి హత్యలూ జరగవు. అదో ప్రశాంతమైన ఊరు. కానీ ఉన్నట్టుండి ఆ ఊరిలో సీరియల్ మర్డర్స్ స్టార్ట్ అవుతాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి సుత్తితో మనుషులను చంపుతుంటాడు. ఆ మర్డర్స్ వెనక ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి ఒక లైబ్రేరియన్ అయిన ఉజ్వలన్ రంగంలోకి దిగుతాడు.

అతను ఊరిలో జరిగే చిన్న చిన్న దొంగతనాలు, మిస్సింగ్ కేసులను పట్టుకోవడంలో బాగా ఫేమస్. మరి అలాంటి ఉజ్వలన్ సీరియల్ మర్డర్స్ కేసులో ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? హంతకుడిని పట్టుకునే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ హత్యల వెనక ఉన్న రహస్యం ఏంటి? అనేది ఈ మూవీ కథ. థ్రిల్స్, సస్పెన్స్‌తో పాటు మధ్యమధ్యలో నవ్వు పుట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి.

ఎవరు నటించారు? (Detective Ujjwalan OTT Release)

  • ద్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan) – డిటెక్టివ్ గా మంచి టైమింగ్, కామెడీతో అదరగొట్టాడు.
  • సిజు విల్సన్ (Siju Wilson)
  • రోనీ డేవిడ్ రాజ్ (Rony David Raj)
  • కోట్టాయం నజీర్ (Kottayam Nazeer) – పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఆయనది ప్రధాన పాత్ర.

ఎందుకు చూడాలి? (Detective Ujjwalan OTT Release)

  • యూనిక్ కాన్సెప్ట్: చిన్న ఊరిలో జరిగే సీరియల్ మర్డర్స్, ఒక కొత్త తరహా డిటెక్టివ్ పాత్ర.. కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.
  • ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: ఈ సినిమాలో ఎలాంటి అశ్లీలత ఉండదు. అందుకే మీరు హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.
  • కామెడీ+మిస్టరీ: సీరియస్ ఇన్వెస్టిగేషన్ తో పాటు మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్స్ మీకు బోర్‌ కొట్టకుండా చూస్తాయి.
  • పర్‌ఫార్మెన్స్: ద్యాన్ శ్రీనివాసన్ నటన ఈ సినిమాకు హైలైట్. ఆయన క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే, మీరు కొత్త తరహా థ్రిల్లర్స్, కామెడీ మూవీస్ చూడాలనుకుంటే, ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ ఒక మంచి ఛాయిస్. Lionsgate Playలో ఈ మూవీని చూడటానికి రెడీగా ఉండండి.


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments