Friday, February 20, 2026
#
HomeHealth & FitnessHow to Turn White Hair Black: తెల్లజుత్తుని మళ్ళీ నల్లగా చెయ్యడం ఎలా?

How to Turn White Hair Black: తెల్లజుత్తుని మళ్ళీ నల్లగా చెయ్యడం ఎలా?

How to Turn White Hair Black: జుత్తు ఒకసారి తెల్లబడితే ఇంకా అంతే సంగతులు. మళ్ళీ నల్లబడటం  అనేది ఉండదు. మర్చిపోవటమే! జుత్తు ఎందుకు తెల్లబడుతుంది? సహజంగా వయసు పెరిగేకొద్దీ తెల్లబడుతుంది. అది సహజంగా జరిగేదే… మన జుత్తు కుదుళ్ళలో “మెలనోసైట్స్” అనే కణాలు ఉంటాయి, వీటిలో మన జుత్తుకి నల్లని రంగుని ఇచ్చే “మెలనిన్” అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్ వల్లే మన జుత్తు నల్లగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనోసైట్స్ మెలనిన్ ని ఉత్పత్తి చేయడం ఆగిపోతుంది. దాంతో మన జుత్తు తెల్లబడిపోతుంది.

తెల్ల జుత్తు మళ్ళీ నల్లబడే అవకాశం లేదా? (How to Turn White Hair Black)

  • వంశపారంపర్యంగా (Hereditary): కొంతమందికి చిన్నప్పుడే జుత్తు తెల్లబడుతుంది. అది వంశపారంపర్యంగా మన తాతల నుండి ఈ ప్రాబ్లెమ్ ఉంది అన్నమాట. అలాంటప్పుడు పూర్తిగా నల్లబడటం అంటే చాలా కష్టం.
  • పోషకాహార లోపం (Malnutrition): ఐరన్, విటమిన్ B12, కాపర్ వంటి పోషకాలు లేకపోతే జుత్తు తెల్లబడే అవకాశం ఉటుంది. అలాంటప్పుడు లాంటి మనం తినే ఆహరం లో ఐరన్, విటమిన్ B12 (Vitamin B12 for hair), కాపర్ ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే, టాబ్లెట్స్ వాడుకోవాలి. దాంతో, కొంతవరకు జుత్తు రంగు మారే అవకాశం ఉంటుంది.
  • ఒత్తిడి (Stress): మనం చేసే ఉద్యోగాలు, బిజినెస్ లతో విపరీతంగా టెన్షన్ పడుతూఉంటాం. ఆ టెన్షన్ కి జుత్తు తెల్లబడటం కాదు ఏకంగా ఊడిపోతుంది. టెన్షన్ తగ్గించుకుంటే కొద్దిలో కొద్దిగా అయినా తెల్లబడటం, ఊడటం కొంచం తగ్గచ్చు.
  • ఆరోగ్య సమస్యలు (Health problems): థైరాయిడ్ ఉన్నా, ఇమ్మ్యూనిటి కి సంబంధించి ప్రోల్మ్స్ ఉన్నా జుత్తు తెల్లబడుతుంది, కాలిపోతుంది. రెండూ జరుగుతాయి. ఇమ్మ్యూనిటి లేకపోతే ఎం బలం ఉంటుంది. థైరాయిడ్కి మందులు వాడుతూ ఇమ్మ్యూనిటీ ని పెంచుకుంటే కొంత మేలు.
  • తాత్కాలికంగా తెల్లబడటం (Temporary whitening): కొంతమంది మహానుభావులు అవసరం ఉన్న లేకపోయినా, పక్కోడు వాడాడని కొని హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటిల్లో ఉండే కెమికల్స్ వల్ల జుత్తు తెల్లబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. హెయిర్ ప్రొడక్ట్స్ ప్రమాదకరం. అందులో ఉండేవన్నీ కెమికల్సే. వాటి జోలికి ఎంత వెళ్లకుండా ఉంటె అంత మంచిది. చేతులారా చెడగొట్టుకున్నవాళ్ళం అవుతాం.

ఆయుర్వేదం, ఇంటి చిట్కాలు (How to Turn White Hair Black – Ayurvedic, Home Remedies):

ఉసిరికాయ, కరివేపాకు, మందారాకు, మందారపూలు, చెట్టు వేళ్ళు, చెట్టు బెరడ్లు, భృంగరాజు, ఆ రాజు ఈ రాజు అని అడ్డమైనవన్నీ కొబ్బరినూనెలో వేసి మరగబెడుతూ ఉంటారు. వాటిని వడగట్టి సీసాలో పోసుకుని తలకి పట్టిస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే, ఈ పద్దతి కొంత నయం అనే చెప్పాలి, కెమికల్స్ తలకి పట్టించడం కంటే, సహజంగా దొరికే ఆకుల్ని, పూలని, బెరడులని ఇలా నూనెలో మరిగించి రాసుకోవడం బెటర్. చేస్తే మంచి జరుగుతుంది. చెడయితే జరగదు.

ఇంట్లో చేసుకునే హెయిర్ పేస్టులు (Home Remedies for Black Hair)

జుత్తుకి రంగెయ్యాలి కానీ కెమికల్స్ ఉండకూడదు.  జుత్తుకి పోషణ అందాలి, మన ఆరోగ్యంగా పాడవకూడదు. అయితే, ఇదంతా ఒక్క రోజులో అయ్యేపనికాదు. క్రమం తప్పకుండా ఒక గడియారం లో ముల్లు తీరినట్టు నిర్విరామంగా దీక్షతో చేస్తే మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే, మనం వాడేది ఇంట్లోవి, ఆయుర్వేద మూలికలు. మరి టైం పడుతుంది. పూర్తిగా నల్లగా కాకపోయినా, జుత్తు తెల్లబడటం అయితే ఆగుతుంది.

ఆయుర్వేద పదార్థాలతో తయారుచేసుకునే హెయిర్ పేస్టులు (Home Remedies for Black Hair – Hair Pastes):

1. గోరింటాకు (హెన్నా), ఇండిగో పౌడర్ కాంబినేషన్:

ఇది చాలా ప్రాచుర్యం పొందిన పద్ధతి. హెన్నా జుట్టుకి ఎరుపు-నారింజ రంగును ఇస్తుంది, ఇండిగో పౌడర్ నీలం రంగును ఇస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల గోధుమ లేదా నలుపు రంగు వస్తుంది.

  • కావాల్సినవి ఏంటో చూద్దాం..
    • జుత్తుకి సరిపడా నాణ్యమైన హెన్నా పౌడరు
    • మీరు తీసుకున్న హెన్నా పౌడరు లో సగం ఇండిగో పౌడరు
    • మీ జుత్తు రంగు ముదురుగా రావడం కోసం టీ డికార్షన్ డికాషన్ లేదా కాఫీ డికార్షన్
    • మీజుత్తు కి రంగు కొద్దిరోజులు ఉండాలి అంటే, ఉసిరికాయపొడి కొంచెం కావాలి.
  • ఎట్టా తయారు చేసుకోవాలి, ఎట్టా వాడాలో చూద్దాం:
    1. టీ డికార్షనో, కాఫీ డికార్షనో తీసుకున్నారుకదా, ఆ డికార్షన్లో హెన్నా పౌడర్ వేసి రాత్రంతా నానబెట్టండి.
    2. పొద్దున్నే లేచి, ఆ దాంట్లో హెన్నా పొడి ని కలపండి. అవసరం అని అనిపిస్తే కొంచెం వేడినీళ్లు కానీ డికార్షన్ కానీ పోసి పేస్టులా చెయ్యండి.
    3. ఈ పేస్టును 1-2 గంటలు తలకి పట్టించి ఉంచండి.
    4. తర్వాత షాంపూ లేకుండా, ఉప్పునీళ్లతో కాకుండా, మంచి నీళ్లతో జుత్తుని శుభ్రంగా కడగండి.
    5. మరుసటి తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యండి.

2. ఉసిరికాయ మరియు కరివేపాకు పేస్ట్:

ఇవి రెండూ జుత్తు నల్లబడటానికే కాదండోయ్… జుత్తుకి మంచి పోషణ ఇచ్చి, బాగా పెరగడానికి సహాయపడుతుంది.

  • కావాల్సినవి ఏంటో చూద్దాం..
    • నీడలో ఎండిన ఉసిరికాయలు, అంత టైం లేదు అంటే, ఆయుర్వేద షాప్ లో ఆమ్లా పొడి దొరుకుతుంది అది తెచ్చుకోండి.
    • తాజా కరివేపాకు ఆకులు గుప్పెడు
    • కొద్దిగా కొబ్బరి నూనె
  • ఎట్టా తయారు చేసుకోవాలి, ఎట్టా వాడాలో చూద్దాం…

    ఉసిరికాయలను రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టండి.

    1. నానబెట్టిన ఉసిరి కాయలు, కరివేపాకుని కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చెయ్యండి.
    2. ఈ పేస్టును నేరుగా జుత్తుకి పట్టించేయ్యండి, లేకపోతే కొద్దిగా కొబ్బరి నూనెలో వేసి, వేడి చేసి, చల్లారాక జుత్తుకి పట్టించండి. మీకు ఏది వీలుగా ఉంటె అది చెయ్యండి.
    3. ఒక గంటసేపు ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యండి.

3. భృంగరాజ్ (గుంటగలగర ఆకు), ఉసిరికాయ పేస్ట్

భృంగరాజ్ అదేనండి, గుంటగరగర ఆకు జుత్తు రంగుని మెరుగుపరచడమే కాకుండా జుత్తు రాలడం తగ్గిస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

  • కావాల్సినవి ఏంటో చూద్దాం..
    • భృంగరాజ్ పౌడర్
    • ఉసిరికాయ పౌడర్
    • నీళ్లు, పెరుగు
  • ఎట్టా తయారు చేసుకోవాలి, ఎట్టా వాడాలో చూద్దాం…
    1. భృంగరాజ్ పౌడర్‌ని, ఉసిరికాయ పౌడర్‌ని సమ పాళ్ళలో తీసుకోండి.
    2. నీళ్లతో కొంచెం పెరుగు కలిపి క్కటి పేస్టులా చెయ్యండి.
    3. ఈ పేస్టుని జుత్తుకి బాగా పట్టించండి.
    4. 50 నిమిషాల నుండి ఒక గంట పాటు ఉంచి, తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడగండి.

చివరిగా… (How to Turn White Hair Black)

జుట్టు శాశ్వతంగా తెల్లబడితే దాన్ని పూర్తిగా సహజంగా నల్లగా మార్చడం చాలా అరుదు. అయితే, కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా పోషకాహార లోపాలు లేదా ఆరోగ్య సమస్యల వల్ల తెల్లబడితే, సరైన చికిత్స, జీవనశైలి మార్పులతో కొంతవరకు రంగు మెరుగుపడే అవకాశం ఉంది.  దీర్ఘకాలికంగా తెల్లబడిన జుట్టు విషయంలో, రంగు వేసుకోవడం లేదా హెన్నా వాడటం వంటివి సాధారణ పరిష్కారాలు.


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments