News

స్వతంత్ర దినోత్సవ వేడుకలపై కేంద్రం కీలక నిర్ణయం

ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి దేశం మీసం తిప్పిన ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ఏ ఒక్కరూ బయటకి రాకుండా డిజిటల్ పద్దతిలో వేడుకల్ని జరుపనుంది కేంద్ర ప్రభుత్వం.

Advertisement

ఎంతో మంది ప్రాణాలని అర్పించి మన దేశానికీ స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్ర పరిమళాల వెనుక ఎంతో మంది బలిదానాలున్నాయి. వారు తమ ప్రాణాలను అర్పించి సాధించిన స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఎంతో ఘనంగా ఆగష్టు 15 న ఎర్రకోట మీద జెండా ఎగురవేసి జరుపుకుంటాం. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అతిధుల సమక్షంలో మన దేశ ప్రధానమంత్రి ప్రసంగం, శకటాల ప్రదర్శనలు,సైనికుల విన్యాసాలు, విద్యార్థులు చేసే పరెడ్లు మధ్య అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటాం. కానీ ఈసారి కరోనా మహమ్మారి వలన జరుపుకోలేకపోతున్నాం.

తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి దేశం మీసం తిప్పిన ఎంతో మంది స్వతంత్ర సమరయోధులకు “నా టీవీ తెలుగు” నివాళి అర్పిస్తోంది. – Turaga Pavan Chand

ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఎక్కువ మంది జనం గుమికూడితే కరోనా ఒకరినుంచి మరొకరికి సులభంగా సంక్రమించే ప్రమాదం పొంచి ఉండటంతో స్వతంత్ర దినోత్సవ వేడుకలను డిజిటల్ పద్ధతిలో జరుపుకోవాలని అన్ని రాష్ట్రాలకు ప్రధాని మోడీ ఆదేశించారు. ఎర్రకోట వద్ద నిర్వహించే కవాతు, గౌరవ వందనం వంటి అన్ని కార్యక్రమాలను వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కువమంది చూసేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చెయ్యాలని కేంద్రహోంశాఖ నిర్ణయించింది. అంటే కాదు, కరోనా మీద యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించాలని సూచించింది. విద్యార్హులతో పరేడ్ నిర్వహించవద్దని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రతి ఏటా వైభవంగా ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి మాత్రం నిరాడంబరంగా జరగబోతున్నాయి.

ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు, మనం వారిలాగా ప్రాణాలని అర్పించక్కర్లేదు,  సామజిక దూరాన్ని పాటిద్దాం, బయటకి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా మాస్కులు ధరిద్దాం, కరోనా మీద యుద్ధం చేద్దాం, ఆరోగ్య భారతాన్ని అందించి దేశం మీసం తిప్పుదాం… బోలో భారత్ మాతాకీ జై… . – Turaga Pavan Chand

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

naatv telugu youtube channel
Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Back to top button
Close