Friday, February 20, 2026
#
HomeCinemaJunior Movie OTT: జూనియర్ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్

Junior Movie OTT: జూనియర్ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్

Junior Movie OTT: జూనియర్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్:

కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా నటించిన ఈ సినిమా ఆగస్టు 2 నుండి ప్రైమ్ వీడియోలో (Prime Video) స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది!

కిరీటి రెడ్డి (Kireeti Reddy), శ్రీలీల (Sreeleela), జెనీలియా (Genelia Deshmukh) ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘జూనియర్’ (Junior Movie) సినిమా జూలై 18న థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా, కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బాగా మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ  (Junior OTT) రిలీజ్‌పై ఓ హాట్ అప్‌డేట్ వచ్చింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా థియేటర్లలో రన్ దాదాపు పూర్తయిందట. అందుకే, రెండు వారాల వ్యవధిలోనే ‘జూనియర్’ (Junior) సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఆగస్ట్ 2 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది. మొదట ఆగస్ట్ 15న స్ట్రీమింగ్ చేయాలనుకున్నా, సినిమాపై ఉన్న బజ్‌ను క్యాష్ చేసుకోవడానికి డేట్‌ను కాస్త ముందుకు జరిపినట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమయ్యారు. జెనీలియా కీలక పాత్రలో నటించగా, రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ప్రేమ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కిరీటి తన నటన, డాన్స్‌తో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా అతని ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్ చాలా బాగుందని ప్రశంసలు అందుకున్నాడు. శ్రీలీల తన సహజసిద్ధమైన నటన, గ్లామర్‌తో మరోసారి మెప్పించింది. ముఖ్యంగా, ‘వైరల్ వయ్యారి’ (Viral Vayyari Song) పాటలో వీరిద్దరి డాన్స్ హైలైట్‌గా నిలిచింది.

  • “తెలుగు వార్తలు, సినిమా అప్‌డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
  • నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.

📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments