Friday, February 20, 2026
#
HomeCinemaKingdom Movie Review: కింగ్డమ్ మూవీ రివ్యూ

Kingdom Movie Review: కింగ్డమ్ మూవీ రివ్యూ

Kingdom Movie Review: ‘కింగ్డమ్’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడా? ముళ్ళ కిరీటమా?

రౌడీ స్టార్ (Rowdy Star) విజయ్ దేవరకొండ, గత కొంతకాలంగా సరైన హిట్ కోసం తెగ ఎదురుచూస్తున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) కూడా పెద్దగా మెప్పించకపోవడంతో, ‘మళ్లీ రావా'(Malli Raava), ‘జెర్సీ'(Nani’s Jersey) వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్డమ్(Kingdom)’ పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (jersey), ఫార్చ్యూ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమాని నిర్మిచారు. ఈ సినిమా కోసం నాగవంశీ, సాయి సౌజన్య భారీగా ఖర్చు పెట్టారు. మరి ఈ ‘కింగ్డమ్’ (#vd12) విజయ్‌కి కంబ్యాక్ ఇచ్చిందా? లేదా? మన ప్రేక్షకులకి ముళ్ళ కిరీటం పెట్టిందా? కింగ్డమ్ రివ్యూలో (Kingdom Review) తెలుసుకుందాం రండి…!

కథేంటంటే (Kingdom Movie Story)?

కథ 1920ల నాటి శ్రీకాకుళం తీర ప్రాంతంలో మొదలవుతుంది. బ్రిటీషర్లు బంగారు గనుల కోసం ఓ తెగని నాశనం చేయాలనుకుంటే, ఓ యోధుడు తన ప్రజలను శ్రీలంకలోని జాఫ్నాకు పంపి ప్రాణాలు త్యాగం చేస్తాడు. అలా వెళ్లిన ఆ తెగ, ఎప్పటికైనా తిరిగి స్వదేశం రావాలని కలలు కంటూ ఉంటుంది.

దాదాపు 70 ఏళ్ల తర్వాత, కానిస్టేబుల్ సూరి (విజయ్ దేవరకొండ) తన అన్నయ్య శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన శివ, శ్రీలంకలోని అదే జాఫ్నా తెగకి నాయకుడిగా ఉన్నాడని తెలుస్తుంది. అండర్‌కవర్ ఆపరేషన్‌లో భాగంగా రా అధికారి సూరిని శ్రీలంకకు పంపిస్తాడు. అసలు సూరిని ఎందుకు ఎంచుకున్నారు? శివను ఆ తెగ నుంచి ఎందుకు తప్పించాలి? ఇంటి నుంచి పారిపోయిన శివ అక్కడికి ఎలా వెళ్ళాడు, ఎలా నాయకుడయ్యాడు? ఇదంతా అక్రమ ఆయుధాల రవాణాకు, భారత్‌కి ముప్పుకు ఎలా లింక్ అయింది? అనేది ‘కింగ్డమ్’ మెయిన్ కథ.

సినిమా విశ్లేషణ: ప్రథమార్థం హై, ద్వితీయార్థం డై! (Kingdom Movie Analysis: First Half is High; Second Half is Low!)

సినిమా ప్రథమార్థం అయితే అద్భుతం. శ్రీకాకుళం తెగ బ్రిటీషర్ల నుంచి తప్పించుకోవడం, శ్రీలంకలో స్మగ్లర్లుగా మారడం, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌లతో అక్రమ ఆయుధాల రవాణా చేయడం… ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక అన్నని కలవడానికి సూరి చేసే ప్రయత్నాలు, ఎదురైన కష్టాలను తను ఎదుర్కొన్న విధానం గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఇంటర్వెల్ వరకు సినిమా నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనిపిస్తుంది.

కానీ… అసలు కథ ద్వితీయార్థంలోనే మొదలవుతుంది. ప్రథమార్థాన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లిన గౌతమ్ తిన్ననూరి, ద్వితీయార్థంలో మాత్రం గ్రాఫ్‌ని దించేశాడు. ఎలివేషన్ సీన్లు రావాల్సిన చోటంతా సైలెంట్‌గా ఉంటుంది. ఇది ఆడియన్స్‌లో అసహనాన్ని పెంచుతుంది. కథని ఎలా ముగించాలో అర్థం కానట్టు దర్శకుడు తడబడినట్టు అనిపిస్తుంది. అన్నదమ్ముల సెంటిమెంట్‌ని కూడా చివరకు నీరుగార్చేశారు. ఆ తెగకి రాజుగా సూరి నెత్తిన కిరీటం పెట్టడం, ప్రేక్షకుడి నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టినట్టే అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఫ్లో పూర్తిగా మిస్ అయింది. ఏ సన్నివేశానికీ కనెక్ట్ అవ్వలేం. చివరకు ప్రేక్షకుల మనసులో మెదిలే ప్రశ్నలనే వాయిస్ ఓవర్‌లో చెప్పి, సినిమాని ముగించేసి, సెకండ్ పార్ట్ ఉండొచ్చు అనే లీడ్ ఇచ్చారు. ఈ మధ్య మేకర్స్‌కి రెండు భాగాల పిచ్చి పట్టుకుందేమో! ఒకే కథను ఒకే పార్ట్‌లో చెప్పలేకపోవడం బలహీనతే కదా?

హైలైట్స్: విజయ్ వన్‌ మ్యాన్ షో! (Kingdom Movie Highlights: Vijay Deverakonda one-man show!

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నటుడిగా తను వందకు వంద మార్కులు సాధించాడు. నిజంగా, ఆయనే సినిమాని నిలబెట్టాడు. డిఫరెంట్ షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. అన్నదమ్ముల ఎమోషన్ ఈ సినిమాకి మెయిన్ పాయింట్. ఈ ఎమోషన్స్ ని టీమ్ చక్కగా క్యారీ చేసింది.

అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం. పాటలు బాగున్నాయి, బీజీఎం అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. తన బీజీఎంతో మామూలు సీన్లని కూడా ఎలివేట్ చేశాడు. శ్రీలంకలో యాక్షన్ సీన్లు బాగున్నాయి. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ప్రతి ఫ్రేమ్ చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎమోషనల్‌గా, హై ఇచ్చేలా ఉంటుంది.

మైనస్‌లు: లాజిక్స్ మిస్సింగ్! (Kingdom Movie Minuses: Missing Logic!)

మైనస్‌ల విషయానికి వస్తే, కథలో లూప్స్ పెద్ద మైనస్. లాజికల్‌గా చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వదిలేశారు. కథలో క్లారిటీ మిస్ అయింది. అన్నదమ్ముల ఎమోషన్స్‌తో ట్రైబల్ నాయకుడు ఎపిసోడ్‌ని లింక్ చేసే విషయంలో దర్శకుడు ఇంకా జాగ్రత్త పడాల్సింది. బలమైన విలన్ లేడు. సత్యదేవ్ (Satyadev) పాత్రను సరిగా వాడుకోలేకపోయారు, అతని క్యారెక్టర్‌ని పూర్తి స్థాయిలో చూపించలేదు.

సినిమా మొత్తం సీరియస్‌గా సాగుతుంది, కాస్త రిలీఫ్ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ సీన్లు ఉంటే బాగుండేది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పాత్ర పరిమితంగానే ఉంటుంది, హీరో-హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్‌ని కూడా తీసేశారు. డైలాగులు కూడా వీక్‌గా ఉన్నాయి. కథకి తగ్గ బలమైన డైలాగులు లేవు. క్లైమాక్స్ యాక్షన్ సీన్‌లో విజయ్‌ని దూరంగా పెట్టడం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఇవన్నీ ఇంకాస్త జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్‌లో ఉండేది. ఎడిటర్ నవీన్ నూలి ద్వితీయార్థంలో ఇంకాస్త షార్ప్‌గా కట్ చేసి ఉండాల్సింది.

నటీనటుల పనితీరు (Actors’ Performance:):

సూరి పాత్రలో విజయ్ దేవరకొండ తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడు, డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్లలో అయితే రెచ్చిపోయాడు. శివ పాత్రలో సత్యదేవ్ కూడా బాగా నటించాడు, ఎమోషన్స్ పరంగా మెప్పించాడు. డాక్టర్‌గా భాగ్యశ్రీ బోర్సే తన అందంతో ఆకట్టుకుంది కానీ ఆమెకు పెద్దగా సీన్స్ లేవు. నెగటివ్ రోల్‌లో వెంకటేష్ వైపీ చాలా బాగా చేశాడు, ఈ సినిమా అతనికి మంచి గుర్తింపు తెస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

టెక్నీషియన్ల పనితీరు(Kingdom Technicians’ Performance:):

అనిరుధ్ (anirudh) మ్యూజిక్ సినిమాకి పెద్ద హైలైట్, ప్రాణం. సినిమాటోగ్రాఫర్లు జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ కెమెరా వర్క్ బాగుంది, విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) సెలెక్ట్ చేసుకున్న పాయింట్ బాగున్నా, కథనాన్ని నడిపించే విషయంలో మాత్రం తడబడ్డాడు అని అనిపించింది.  డైరెక్షన్ పరంగా ఆయన ఇంకా బాగా చేయాల్సింది. మాస్, యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టి, అక్కడ సక్సెస్ అయ్యారు. కానీ కథ విషయంలో, సినిమాని నడిపించే విషయంలో ఆయన క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) భారీగా ఖర్చు పెట్టినా, అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందేమో అనిపిస్తుంది.

ఓవరాల్‌గా:

‘కింగ్డమ్’ (Kingdom Movie) విజయ్ దేవరకొండ నటన కోసం, అనిరుధ్ బీజీఎం కోసం, బ్రదర్స్ సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం చూడగలిగే సినిమా. ఇది ఒక ఎబౌ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చే ఆస్కారం ఉంది.

ముగింపు: ద్వితీయార్థంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ‘కింగ్డమ్’ మరో స్థాయిలో ఉండేదేమో, మీరేమంటారు?

  • “తెలుగు వార్తలు, సినిమా అప్‌డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
  • నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.

📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments