Friday, February 20, 2026
#
HomeNewsMaruti Suzuki's First EV: మారుతి నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ e-Vitara వచ్చేస్తోంది

Maruti Suzuki’s First EV: మారుతి నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ e-Vitara వచ్చేస్తోంది

Maruti Suzuki’s First EV: e-Vitara Launch Date, Price, Range & Features of Suzuki’s First Electric SUV in India.

ఇన్నాళ్లూ తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే కార్లతో మన మనసు గెలుచుకున్న మారుతి సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి దూసుకురాబోతుంది. వాళ్ల నుంచి రాబోతున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV పేరు Maruti Suzuki’s First EV e-విటారా.

Maruti e-Vitara first electric SUV

మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది అంటే… (Maruti Suzuki’s First EV e-Vitara launching date)

సెప్టెంబర్ 3, 2025న ఈ కొత్త కారు మార్కెట్లోకి విడుదల కాబోతుంది. దీని ధర సుమారు రూ. 17 లక్షల (e-Vitara price) నుంచి ప్రారంభం అవుతుందని అంచనా. మారుతి నుంచి వస్తున్న కారు కాబట్టి, దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో, ఎంత రేంజ్ ఇస్తుందో తెలుసుకుందాం.

E vitara

పవర్ అండ్ పర్ఫార్మెన్స్ (Maruti Suzuki’s First EV E-Vitara Range & Performance):

ఈ e-విటారా రెండు రకాల బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. ఒకటి 49 kWh బ్యాటరీ, మరొకటి 61 kWh బ్యాటరీ. దీని రేంజ్ 500 కిలోమీటర్ల (e-Vitara range) వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా, 80% ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు, ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు.

ఈ కారు మూడు ఇంజిన్ కాన్ఫిగరేషన్స్‌తో వస్తుంది.

  • మొదటిది 144 bhp పవర్, 189 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • రెండోది 171 bhp పవర్, 189 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • అదనంగా, 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) వెర్షన్ కూడా ఉంది. ఇది 181 bhp పవర్, 300 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Maruti e-Vitara

కొత్త ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? Maruti Suzuki’s First EV Features

మారుతి e-విటారాలో అధునాతన ఫీచర్స్ చాలా ఉన్నాయి.
  • డిస్‌ప్లే: 26.04 cm మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, డిజిటల్ కాక్‌పిట్ ఉంటాయి.
  • సేఫ్టీ: ADAS లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్‌తో పాటు 7 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా వస్తున్నాయి. అంతేకాదు, క్రూజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
  • సౌకర్యాలు: కనెక్టెడ్ కార్ ఫీచర్స్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి.
  • డ్రైవింగ్ మోడ్స్: ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.
  • డిజైన్: మ్యాట్రిక్స్ LED DRLS, మ్యాట్రిక్స్ రియర్ ల్యాంప్స్, R18 ఏరియో డైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో చూడటానికి కూడా ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Click for: e-vitara brochure

మారుతి ఎలక్ట్రిక్ కార్లలో కూడా తనదైన ముద్ర వేయడానికి ఈ e-విటారా ఒక మంచి ఆరంభం అని చెప్పొచ్చు. తక్కువ ధరలో మంచి ఫీచర్స్, అధిక రేంజ్, మంచి సేఫ్టీ ఉండటం వల్ల ఈ కారు భారతీయ మార్కెట్‌లో బాగా సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments