Entertainment

కేక పెట్టిస్తున్న నాగ శౌర్య

డిఫరెంట్ లుక్ తో హిట్ కోసం గట్టిగా విల్లు ఎక్కుపెట్టాడు నాగశౌర్య. అందరిచేత ఔరా అనిపిస్తున్నాడు.

Advertisement

 సంతోష్‌ జాగర్లమూడి డైరెక్షన్ లో నాగ శౌర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ నిమాకి ఇంకా పేరు పెట్టలేదు, పేరుపెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ ని నిర్మాత నారాయణదాస్‌ కె. నారంగ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీ తో ఒంటి మీద గాయాలతో, విల్లు ఎక్కుపెట్టి తీక్షణంగా చూస్తున్న లుక్ చూస్తుంటే ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డట్టే కనిపిస్తోంది. నాగ శౌర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనేంతలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఇదే రేంజ్ లో సినిమా కూడా ఉండాలని కోరుకుందాం.

నాగశౌర్య 20 వ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన శేఖర్ కమ్ముల – తురగా పవన్ చంద్

ఇప్పటికే డిఫరెంట్ సినిమా లు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతని తెచ్చుకున్నాడు. ఇది వరకులా వరసపెట్టి సినిమాలు చేయలేక పోతున్నాడు. సరైన హిట్ కోసం పడుతున్న తపన ఈ ఫస్ట్ లుక్ లో కనపడుతోంది. ఈ సినిమా తో అయినా నాగ శౌర్య హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.

ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తురగా పవన్ చంద్

విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నారాయణదాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు.

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Back to top button
Close