Entertainment

ఓటీటీ లో విడుదలవుతున్న రవితేజ క్రాక్ మూవీ

ఓటీటీ లో విడుదలవుతున్న తోలి తెలుగు భారీ బడ్జెట్ చిత్రం రవితేజ, గోపీచంద్ ల క్రాక్

Advertisement

కరోనా వలన పెట్టిన లాక్ డౌన్ తో ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. లాక్ డౌన్ సడలించిన సినిమా థియేటర్స్ కి మాత్రం అనుమతి ఇవ్వటం లేదు, అనుమతి ఇచ్చినా కరోనా భయంతో థియేటర్స్ కి ఎవరూ రాని పరిస్థితి. ఇప్పటికే సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇప్పట్లో సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఏమి చెయ్యాలో పాలుపోని నిర్మాతలకి అదృష్టదేవత ఓటీటీ రూపంలో వచ్చింది. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఏది ఓటీటీ లో రిలీజ్ అవ్వనప్పటికీ చిన్న సినిమాలు విడుదలయ్యి సంతృప్తి పరిచయాన్ని చెప్పాలి. దాంతో గోపి చాంద్ దిరెచ్తిఒన్ లో రవి తేజ హీరోగా వస్తున్నా క్రాక్ సినిమా ని ఓటీటీ లో విడుదల చెయ్యాలని ఠాగూర్ మధు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. క్రాక్ రిలీజ్ కి ఒక ఓటీటీ సంస్థ ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ సమాచారం. థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ప్రేక్షకులందరూ ఓటీటీ లో సినిమాలు చూస్తున్నారు. ఈ విధంగా క్రాక్ కనక ఓటీటీ లో రిలీజ్ అయితే ఫాన్స్ కి పండగే అని చెప్పాలి. అంతేకాదు ఓటీటీ లో రిలీజ్ అయ్యే తోలి తెలుగు భారీ చిత్రం క్రాక్ అనే చెప్పాలి. మరోవైపు బాలీవుడ్ సినిమాలు అయినా లక్ష్మి బాంబు, దిల్ బేచారా కూడా ఓటీటీలో విడుదలకు తేదీలు ప్రకటించేశారు కూడా.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close