Saiyaara OTT: నిన్నటి తరం ప్రేమ కథలు, వాటిని తెరపై చూపించే విధానం కొంచెం రొటీన్ అయిపోయాయి. ఈ రోజుల్లో అందరూ ఫ్రెష్ స్టోరీలను, కొత్త నటీనటులని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలాంటి సినిమానే ‘సైయారా‘ #SaiyaaraMovie2025. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ మోహిత్ సూరి (Mohir Suri) దర్శకత్వంలో, కొత్త హీరో అహాన్ పాండే, హీరోయిన్ అనీత్ పడ్డా కలిసి నటించిన ఈ రొమాంటిక్ డ్రామా సినిమా చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా దీని గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఈ సినిమా జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. డెబ్యూ హీరో సినిమా అయినా కానీ, 109 కోట్ల కలెక్షన్లు సాధించి, అందరిని ఆశ్చర్యపరిచింది. మోహిత్ సూరి గతంలో తీసిన ‘ఏక్ విలన్’, ‘ఆషికీ 2’ వంటి హిట్ సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్లని కూడా ‘సైయారా’ దాటేసింది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి, సోషల్ మీడియా రీల్స్ లో తెగ ట్రెండ్ అయ్యాయి.
సైయారా ఓటీటీ రిలీజ్.. (Saiyaara OTT release date confirmed)
బాక్సాఫీస్‌ను షేక్ చేసి, కుర్రకారుని ఫిదా చేసిన ‘సైయారా’ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకి గుడ్‌న్యూస్. ఆల్రెడీ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ (@netflix_in) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో సరైన ఓటీటీ డేట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లందరికీ ఇప్పుడు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 12, 2025 నుంచి స్ట్రీమింగ్కి #SaiyaaraOnNetflix అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ స్నేహితులతో కలిసి ‘సైయారా’ సినిమా చూసేందుకు రెడీగా ఉండండి.
అయితే, ఈ డేట్ గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. యశ్ రాజ్ ఫిల్మ్ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఓటీటీ డేట్ రివీలైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ డేట్ తెగ చక్కర్లు కొడుతోంది. పక్కా అని కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి, ఈ డేట్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కథ ఏమిటంటే.. (Saiyaara Story)
వాణి (అనీత్ పడ్డా-Aneet Padda), తన లవర్ మహేష్ పెళ్ళికి కొన్ని క్షణాల ముందు వదిలేయడంతో చాలా బాధపడుతుంది. ఆరు నెలల తర్వాత, కొత్త ఆఫీస్ లో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకి క్రిష్ (అహాన్ పాండే -Ahaan Panday) అనే సింగర్ పరిచయమవుతాడు. ఇద్దరూ తమ గతం గురించి తెలుసుకుని, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, నెమ్మదిగా ప్రేమలో పడతారు. కానీ, వాణికి ఒక హెల్త్ ఇష్యూ రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు వాణికి ఏం అయింది? వాణి, క్రిష్ కథ సుఖాంతం అయిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా కొరియన్ సినిమా ‘ఎ మూమెంట్ టు రిమెంబర్’ కి కాపీ అని సోషల్ మీడియాలో కొంతమంది నెగటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. కానీ, బాలీవుడ్ లో చాలా సినిమాలు ఇలా విమర్శలు ఎదుర్కొన్నాయి. ఈసారి ఆ లిస్ట్ లో సయ్యారా కూడా చేరింది.
మొత్తానికి, ‘సైయారా’ సినిమా (Saiyaara Movie) ఒక మంచి రొమాంటిక్ ఫిల్మ్. మంచి పాటలు, ఎమోషనల్ స్టోరీ, ఫ్రెష్ గా ఉన్న కాస్టింగ్ తో యూత్ ని, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలో ఓటీటీలో రాబోతున్న ఈ సినిమాని మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి.
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


