Prabhas Dupe: ఎంతో ఖర్చుపెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. కోట్లతో వ్యాపారం. తేడా కొట్టిందంటే ఇక అంతే సంగతులు. అందుకని నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోల విషయంలో అయితే మరీను. హీరోలను మల్లెపువ్వుల్లాగా చూసుకుంటారు. కష్ట తరమైన సన్నివేశాల్లో నటించాలన్న, రిస్కీ ఫైట్స్ చెయ్యాలన్న డూప్ ని పెడతారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకే ఇదే పంథా. అందుకే హీరోల డూపులకు భలే డిమాండ్.
నేటి తరం హీరోలు కూడా డూపుల మీద ఆధారపడక తప్పట్లేదు. అందులో ప్రభాస్ (Prabhas) పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఈమధ్య మరీను. ప్రభాస్ నడుము, మోకాలి నొప్పులతో బాధ పడుతున్నట్టు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
అసలే రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కి 2829 AD (Kalki 2829 AD Movie) చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్ చూస్తుంటే ఫైట్స్ బాగానే ఉండేట్టు ఉన్నాయ్. ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువగా ప్రభాస్ డూపులమీద ఆధారపడదు న్యూస్ బైటకి వచ్చింది. అంతే కాదు ప్రభాస్ డూపు రెమ్యూనరేషన్ (Prabhas Dupe Remuneration) కూడా రోజుకి రూ. 30 లక్షలనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభాసే 100 నుంచి 150 కోట్లకు తీసుకుంటుంటే, ప్రభాస్ డూపు అంటే ఆమాత్రం ఉండదా అంటున్నారు.
మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ రాజా సాబ్ (Raja Saab) చేస్తున్నాడు. సందీప్ రెడ్డి తో స్పిరిట్ (Spirit) చెయ్యబోతున్నాడు. కల్కి 2829 AD శరవేగంగా చిత్రీకరణ ఒక వైపు, VFX వర్క్ మరో వైపు జరుగుతున్నాయి.
నా టీవీ తెలుగు ని సందర్శించినందుకు ధన్యవాదాలు.
Follow: NaaTVTelugu Twitter