Ooru Peru Bhairavakona OTT: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవ కోన’. వెన్నెల కిషోర్, వైవా హర్ష, రవిశంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
గత కొన్నేళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతోన్న సందీప్ కిషన్ కు ఊరు పేరు భైరవ కోన కొంచెం లీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.
అద్భుతం అని అనలేం కానీ, ఖచ్చితంగా ఒకసారి, ఇంటిల్లిపాది కూర్చుని చూసే సినిమా. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఒక సాంగ్ బాగుంటాయి. కొన్ని సీన్స్ థ్రిల్ కి గురిచేస్తాయి. థియేటర్ లో ఫరవాలేదనిపించింది. రూ.25 కోట్లకి పైగా వసూళ్లు వచ్చినట్లు స్వయంగా హీరో సందీప్ కిషన్ ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ భైరవ కోన ఓటీటీ లోకి రాబోతోంది. ప్రముఖ ఓటటీ సంస్థ జీ5 (Zee5) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను (Ooru Peru Bhairavakona digital streaming on Zee5) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అధికారక ప్రకటన అయితే రాలేదు. త్వరలో వస్తుందని సమాచారం.
భైరవ కొనలో అడుగుపెడితే ప్రాణాలతో బైటపడరు, మరి అలంటి ఊరిలో చిక్కుకున్న హీరో హీరోయిన్లు ఎలా ప్రాణాలతో బైటపడ్డారు? అసలు ఆ ఊరికి ఎందుకు వచ్చారు? చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. చెపితే బాగోదు.
ఇప్పటి వరకు మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే చూడండి. ఎంజాయ్ చెయ్యండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇంట్లోనే కూర్చుని ఈ చిత్రాన్ని ఆస్వాదించండి.
నా టీవీ తెలుగు ని ఆదరించండి.
Follow us on NaaTV Telugu Twitter