Thursday, February 19, 2026
#
HomeHealth & FitnessConstipation: టాయిలెట్‌కి వెళ్లకపోతే, పొట్ట ఎందుకు ఉబ్బుతుంది?

Constipation: టాయిలెట్‌కి వెళ్లకపోతే, పొట్ట ఎందుకు ఉబ్బుతుంది?

stomach bloating due to constipation causes and remedies:మీరు టాయిలెట్‌కి వెళ్లకపోతే, పొట్ట ఉబ్బడానికి ప్రధాన కారణం మలబద్ధకం(Constipation).

మలబద్ధకం వల్ల పొట్ట ఉబ్బటం సాధారణంగా కనిపించే తీవ్రమైన సమస్య. మలబద్ధకం (What Is Constipation?) అంటే మలం గట్టిపడి, బయటకు వెళ్లడం కష్టమవడం. ఇలాంటప్పుడు మీ ప్రేగులలో మలం పేరుకుపోతుంది. దీనితో పాటు, మీ జీర్ణవ్యవస్థలో గ్యాస్ (వాయువు) కూడా ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ రెండూ కలిసి పొట్ట ఉబ్బరానికి, అసౌకర్యానికి దారితీస్తాయి. మలబద్ధకం వల్ల పొట్ట ఉబ్బడానికి ముఖ్యమైన కారణాలు, నివారణ చిట్కాలు తెలుసుకుందాం.

మలబద్ధకం వల్ల పొట్ట ఉబ్బడానికి ఇతర కారణాలు (Causes of Stomach Bloating Due to Constipation):

  • గ్యాస్ (Gas): జీర్ణం కాని ఆహార పదార్థాల వలన ప్రేగులలో ఉండటం వలన అవి పులిసిపోయి, ప్రేగుల్లో గ్యాస్ గా మారుతుంది. అపానవాయువు రూపంలో బయటకి వస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. నలుగురిలో ఇబ్బందిగా ఉంటుంది. ఇది bloating కు కారణమవుతుంది.
  • ఆహరం అరుగుదల నెమ్మదించడం (Slow Digestion): సరిగ్గా నమలకుండా, హడావిడిగా, ఎలాపడితే అలా నమలకుండా తినడం వలన ఫాస్ట్గా అరగదు. టైం లేదని ముద్దలు మింగేస్తాం అపుడు జీర్ణం అవడానికి టైం తీసుకుంటుంది. సరిగ్గా నమిలి తినకపోతే, పొట్ట ఉబ్బరిస్తుంది.
  • మలబద్ధకానికి (Constipation main reasons) ప్రధాన కారణాలు ఇవే:

    • తక్కువ నీరు తాగడం
    • ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం
    • అధిక బరువు
    • ఆహారపు అలవాట్ల మార్పులు (ఊళ్ళు మారడం, ప్రయాణాలు)
    • హార్మోనల్ మార్పులు (గర్భధారణ సమయంలో)

పొట్ట ఉబ్బరం (Stomach Bloating) నుండి ఉపశమనం (Relief) పొందడానికి చిట్కాలు (Remedies to Reduce Bloating from Constipation)

మలబద్ధకం వల్ల వచ్చే పొట్ట ఉబ్బరం నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
  • నీరు ఎక్కువగా తాగండి (Drink enough water daily): ప్రేగుల్లో మలం మెత్తబడి, సాఫీగా మల విసర్జన జరుగుతుంది.
  • పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి (Consume fiber-rich foods):  జీర్ణక్రియ మెరుగవ్వాలంటే ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు తినాల్సిందే. అప్పుడు మలబద్దకం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఆలా అని ఒకేసారి ఎక్కువ ఫైబర్ ఉన్నవి తింటే మళ్ళీ గ్యాస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎండిన మితంగా తీసుకోవాలి. ఏదయినా… ఒక్కరోజులో అయ్యేపనులు కాదు. అలవాటు చేసుకోవాలి.
  • శారీరక శ్రమ ఉండాలి (Regular physical activity): మీరు చేసే శ్రమ ప్రేగులని కదిలిస్తుంది. సుఖ విరోచనం అయ్యేలా చేస్తుంది. మన దినచర్యలో వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. రోజు నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చెయ్యండి.
  • చిన్నపాటి భోజనం తీసుకోండి (Eat smaller meals): ఒకేసారి ఎక్కువగా తినకుండా, చిన్న చిన్న భోజనాలు ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.
  • నెమ్మదిగా తినండి మరియు బాగా నమలండి (Chew your food slowly): త్వరత్వరగా తినడం వల్ల గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంది, ఇది గ్యాస్‌కు కారణమవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది.
  • గ్యాస్ కలిగించే ఆహారాలను తగ్గించండి: బీన్స్, బ్రోకలీ, క్యాబేజీ, కార్బోనేటేడ్ పానీయాలు, కృత్రిమ స్వీటెనర్లు వంటివి కొంతమందికి గ్యాస్‌ను పెంచుతాయి. వీటిని తగ్గించడం మంచిది.

అంతేకాకుండా… Maintain proper disciplilne to avoid stomach bloating and constipation causes Follow these Home remedies:

  • తప్పనిసరిగా ఉదయం ఒకే సమయానికి మలవిసర్జన చేయడానికి ప్రయత్నించండి.
  • అపాన వాయువు ఇచ్చే ఆహారాలను గుర్తించి వాటిని తగ్గించండి.
  • రోజూ కనీసం 20–30 నిమిషాలు నడవండి.
  • మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా మలవిసర్జన చేసేందుకు దృష్టిని పెట్టండి.

ఇంట్లో ఉన్న సహజ చికిత్సలు (Natural Home Remedies for Constipation)

  • ఎండు మున్నకాయలు (Dry prunes): ఇవి మలాన్ని మెత్తబరచి త్వరగా బయటకు పంపిస్తాయి.
  • గోరువెచ్చని నీటిలో నిమ్మరసం: ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచిది.
  • ఇసబగోలు (Isabgol / Psyllium Husk): రాత్రి పడుకునే ముందు పాలలో కలిపి తాగండి.

ప్రోబయోటిక్స్ తీసుకోండి (Probiotics): పెరుగు, కేఫీర్ వంటి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు లేదా సప్లిమెంట్లు ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ప్రోబయోటిక్స్ (Probiotics) అంటే మన శరీరానికి, ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు మేలు చేసే సజీవ సూక్ష్మజీవులు (లైవ్ బ్యాక్టీరియా మరియు ఈస్ట్). వీటిని “మంచి బ్యాక్టీరియా” అని కూడా అంటారు.మన ప్రేగులలో సహజంగానే బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటుంది, వీటిని ‘గట్ మైక్రోబయోమ్’ అంటారు. ఈ బ్యాక్టీరియాలో మంచివి, చెడ్డవి రెండూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా సరైన సంఖ్యలో ఉన్నప్పుడు, అది మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ ఈ మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి.

  • ప్రోబయోటిక్స్ ఎలా పనిచేస్తాయి?
  • ప్రోబయోటిక్స్ మన ప్రేగులలోని సహజ బ్యాక్టీరియా సమతుల్యతను పునరుద్ధరించడానికి లేదా నిర్వహించడానికి సహాయపడతాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు:
  1. చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి: ఇవి చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి, వాటిని తగ్గించడంలో సహాయపడతాయి.
  2. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి: ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి, పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తాయి.
  3. రోగనిరోధక శక్తిని పెంచుతాయి: ప్రేగు ఆరోగ్యం రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యం. ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
  4. విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి: కొన్ని ప్రోబయోటిక్స్ విటమిన్ కె మరియు బి విటమిన్ల వంటి ముఖ్యమైన విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి.
  • ప్రోబయోటిక్స్ ఎక్కడ లభిస్తాయి?
  • ప్రోబయోటిక్స్ సహజంగా కొన్ని పులియబెట్టిన ఆహారాలలో లభిస్తాయి, మరియు సప్లిమెంట్ల రూపంలో కూడా ఉంటాయి.ప్రోబయోటిక్స్ లభించే ఆహారాలు:
  • పెరుగు (Yogurt): ఇది అత్యంత సాధారణ మరియు సులభంగా లభించే ప్రోబయోటిక్ ఆహారం. లైవ్ మరియు యాక్టివ్ కల్చర్స్ ఉన్న పెరుగును ఎంచుకోవాలి.
  • కేఫీర్ (Kefir): ఇది పెరుగు లాంటి పులియబెట్టిన పాల పానీయం.
  • సావర్ క్రాట్ (Sauerkraut): పులియబెట్టిన క్యాబేజీ.
  • కిమ్చి (Kimchi): కొరియన్ పులియబెట్టిన కూరగాయల వంటకం.
  • టెంపే (Tempeh): పులియబెట్టిన సోయాబీన్ ఉత్పత్తి.
  • మిసో (Miso): జపాన్ పులియబెట్టిన సోయాబీన్ పేస్ట్.
  • పికెల్స్ (Pickles): ఉప్పునీటిలో పులియబెట్టిన ఊరగాయలు (వినిగర్ లో ఊరవేసినవి కాదు).
  • కంబుచా (Kombucha): పులియబెట్టిన టీ.
  • ప్రోబయోటిక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు:
  • జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి: మలబద్ధకం, అతిసారం (ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వచ్చే అతిసారం), ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.
  • రోగనిరోధక శక్తిని పెంచుతాయి: సాధారణ జలుబు వంటి అంటు వ్యాధుల నుండి రక్షణ కల్పించవచ్చు.
  • బరువు నిర్వహణకు సహాయపడవచ్చు.
  • కొన్ని రకాల అలెర్జీలు మరియు ఎగ్జిమాను తగ్గించవచ్చు.
  • మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపవచ్చు (గట్-బ్రెయిన్ కనెక్షన్ ద్వారా).
    ముఖ్య గమనిక: తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి (Resistance Power) బలహీనంగా ఉన్నవారు ప్రోబయోటిక్స్ సప్లిమెంట్లను (Suppliments) వాడే ముందు వైద్యుడిని (Doctor) సంప్రదించడం చాలా ముఖ్యం.
  • హెర్బల్ టీ (Herbal tea): పుదీనా, అల్లం, నిమ్మకాయతో చేసిన హెర్బల్ టీ తాగండి. సోపు గింజలను నమలండి. ఉబ్బరం, గ్యాస్ కంట్రోల్ అవుతాయి.
  • గోరువెచ్చని నీళ్లు (Hot Water): గోరు వెచ్చని నీళ్లు త్రాగండి. అద్భుతంగా పనిచేస్తుంది. మారీ నూరు కాలిపోయేంత వేడివి కాదు. కాఫీ, టీ ఎంత వేడిగా గా తాగుతామో అంతకంటే కొంచం తక్కువ వేడి సరిపోతుంది.
  • పొట్ట ఉబ్బరం తరచుగా వస్తూ, తీవ్రమైన నొప్పి (Severe abdominal pain), బరువు తగ్గడం, రక్తంతో కూడిన మలం వంటి ఇతర లక్షణాలతో (serious symptoms) కూడి ఉంటే, మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి (doctor consultation).
  • “తెలుగు వార్తలు, సినిమా అప్‌డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
  • నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.

📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments