Friday, February 20, 2026
#
HomeCinemaSumathi Valavu OTT: ZEE5లో వణికిస్తున్న దెయ్యం, ఓటీటీలో టాప్ ట్రెండింగ్ "సుమతి వలవు"

Sumathi Valavu OTT: ZEE5లో వణికిస్తున్న దెయ్యం, ఓటీటీలో టాప్ ట్రెండింగ్ “సుమతి వలవు”

Sumathi Valavu OTT: పీజీ, హాస్టల్ గదుల్లో కూర్చొని హారర్ సినిమాలు చూసి తెగ ఎంజాయ్ చేసే బ్యాచ్‌కి ఇప్పుడో స్వీట్ అలర్ట్. ఎందుకంటే, ఓటీటీలో ఓ హారర్ కామెడీ మూవీ గట్టిగా భయపెడుతూనే, పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది! అరే, ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో అనుకుంటున్నారా? అదేనండి, మలయాళం నుంచి వచ్చిన “Sumathi Valavu”. మలయాళీ సినిమా అంటేనే క్వాలిటీ, క్రియేటివిటీకి పెట్టింది పేరు. తక్కువ బడ్జెట్‌లో ఒక మాస్టర్ పీస్ ఎలా తీయచ్చో వాళ్లు నిరూపిస్తారు. ఈ ఏడాది మాలీవుడ్లో అనేక సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో “సుమతి వలవు” ఒకటి. కేవలం రూ.25 కోట్లు కలెక్ట్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఈ సినిమా “జీ5 ఓటీటీ” ప్లాట్‌ఫామ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇంకేంటి మరి? ఇంట్లో వాళ్లందర్నీ కూర్చోబెట్టుకొని చూసేయడమే!

సుమతి వలవు: ఒక రియల్ లైఫ్ కథ! (Sumathi Valavu OTT)

నిజంగా చెప్పాలంటే, ఈ సినిమా కేవలం కల్పిత కథ కాదు. కేరళలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీసారు. ‘సుమతి వలవు‘ అంటే తెలుగులో ‘సుమతి మలుపు‘ అని అర్థం. కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం జిల్లాలోని మైలమ్మూడుకు సమీపంలో నిజంగానే ఈ మలుపు ఉంది. అక్కడే 1950లలో సుమతి అనే ఒక అమ్మాయిని చంపేసారని, ఆమె ఆత్మ అక్కడే తిరుగుతోందని కథనం ప్రచారంలో ఉంది. ఈ భయంకరమైన స్టోరీని ఫన్నీగా, థ్రిల్లింగ్‌గా ఎలా చూపించారో చూడాలంటే, సినిమా చూడాల్సిందే!

Sumathi Valavu OTT కథలో ఏం ఉంది?

మొత్తానికి కథలోకి వెళ్దాం. కథంతా కల్లేలి అనే ఒక గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామానికి వెళ్లాలంటే, ఒక దట్టమైన అడవి గుండా వెళ్లాలి. ఆ అడవిలో ఒక భయంకరమైన మలుపు ఉంది. అదే సుమతి వలవు. ఈ మలుపు దగ్గర రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ వెళ్లరు. వెళ్తే సుమతి దెయ్యం కచ్చితంగా పట్టుకుంటుంది అని అందరి నమ్మకం.

కానీ, ఊరిలో శేఖరన్ అనే వ్యక్తి పెద్ద కూతురు తన లవర్‌తో కలిసి ఆ రాత్రి పారిపోతుంది. అదే సమయంలో, మన హీరో అప్పూ (అర్జున్ అశోకన్)ను చూసి శేఖరన్ ఫ్యామిలీ అతనిపై కక్ష కడతారు. అప్పుకి, శేఖరన్ రెండో కూతురు భామా (మాళవిక మనోజ్)కు మధ్య ప్రేమ చిగురిస్తుంది. మరి వారి ప్రేమను శేఖరన్ ఒప్పుకుంటాడా? శేఖరన్ పెద్ద కూతురు నిజంగా పారిపోయిందా? లేక సుమతి దెయ్యం చంపేసిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే, మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

Sumathi Valavu OTT మూవీ విశ్లేషణ: హారర్, కామెడీ, లవ్!

హీరో అప్పూకి చీకటంటే భయం. అంత భయస్తుడు ఒకరోజు గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. రాత్రిపూట చీకట్లో ఆ భయంకరమైన మలుపు దాకా వెళ్ళాక, కారు సడన్‌గా ఆగిపోతుంది. అక్కడ జరిగే సన్నివేశాలు నవ్విస్తూనే, హారర్‌ని పంచడంతో ఫస్ట్ హాఫ్ అలా గిర్రున తిరిగిపోతుంది. కానీ, సెకండాఫ్ మాత్రం కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది.

ఈ సినిమాలో, ఒకవైపు ప్రేమ కథ, మరోవైపు హారర్ సీన్స్ రెండూ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అయ్యాయి. మరీ ఎక్కువ భయపెట్టకుండా, ఫన్నీగా, హాయిగా నవ్విస్తూ సినిమా ముందుకు సాగుతుంది. మొత్తానికి ఒక విషయం మాత్రం చెప్పగలం, ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడడానికి చాలా సరదాగా ఉంటుంది. థియేటర్‌లో చూడలేని వాళ్ళకి ఇది ఒక మంచి ఛాయిస్. మరీ ముఖ్యంగా, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. అంటే దెయ్యం ఇంకా వదలలేదు అన్నమాట!


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments