Friday, February 20, 2026
#
HomeAyur VedamAshtanga Hridayam: అష్టాంగ హృదయం అంటే ఏమిటి?

Ashtanga Hridayam: అష్టాంగ హృదయం అంటే ఏమిటి?

Ashtanga Hridayam: అష్టాంగ హృదయం అనేది ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన గ్రంథం. దీన్ని వాగ్భటుడు అనే గొప్ప ఆయుర్వేద పండితుడు సుమారు 6వ శతాబ్దంలో రాశారు. ఆయుర్వేదంలో అంతకుముందు ఉన్న రెండు పెద్ద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహితలోని ముఖ్యమైన విషయాలను తీసుకొని, సులభంగా అర్థమయ్యేలా ఒక పుస్తకంగా రాశారు. (Ashtanga Hridaya is one of the Brihat Trayi of Ayurveda) అందుకే దీన్ని ఆయుర్వేద విద్యార్థులు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

“అష్టాంగ” అంటే ఎనిమిది విభాగాలు (Ashtanga Hridayam: Eight Branches of Ayurveda):

అష్టాంగ” అనే పదానికి ఎనిమిది భాగాలు అని అర్థం. ఈ పుస్తకంలో ఆయుర్వేదం ప్రకారం వైద్యంలో ఉన్న ఎనిమిది ప్రధాన విభాగాలు ఉన్నాయి. అవి:

  1. కాయచికిత్స (Kaya Chikitsa): సాధారణ రోగాలకు, అంతర్గత వ్యాధులకు చేసే వైద్యం. జ్వరం, దగ్గు, జీర్ణ సమస్యలు వంటి వాటికి చికిత్స ఇందులో ఉంటుంది.
  2. శల్య చికిత్స (Shalya Chikitsa): శస్త్రచికిత్స లేదా ఆపరేషన్లు. గాయాలు, విరిగిన ఎముకలు వంటి వాటికి చేసే చికిత్స.
  3. శాలక్య తంత్రం (Shalakya Tantra): కళ్ళు, చెవులు, ముక్కు, గొంతు వంటి మెడ పైభాగంలో వచ్చే సమస్యలకు చేసే వైద్యం. దీన్ని ENT అని కూడా అంటారు.
  4. అగద తంత్రం (Agada Tantra): విష చికిత్స. పాముకాట్లు, పురుగుల కాట్లు, లేదా ఇతర విష సంబంధిత సమస్యలకు చికిత్స.
  5. భూత విద్య/గ్రహచికిత్స (Bhutavidya): మానసిక సమస్యలు, మానసిక ఆరోగ్యం. ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి చికిత్స.
  6. కౌమారభృత్యం/బాలచికిత్స (/Kaumarbhritya): పిల్లల వైద్యం. పిల్లల ఆరోగ్యం, వారికి వచ్చే వ్యాధులు, వాటి చికిత్స.
  7. రసాయన తంత్రం (Rasayana): వయసు పెరగకుండా, రోగనిరోధక శక్తిని పెంచి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి చేసే చికిత్సలు.
  8. వాజీకరణ తంత్రం (Vajikarana): లైంగిక ఆరోగ్యం, సంతానోత్పత్తి సమస్యలకు సంబంధించిన చికిత్సలు.

అష్టాంగ హృదయం ప్రత్యేకత (Importance of Ashtanga Hridayam)

ఈ గ్రంథం కేవలం జబ్బుల గురించి మాత్రమే కాదు. రోగం రాకుండా ఎలా జీవించాలో కూడా చెబుతుంది.

  • రోజువారీ పద్ధతులు (దినచర్య): ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి పనులు చేయాలి.
  • రుతువుల ప్రకారం జీవనం (ఋతుచర్య): ఒక్కో సీజన్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.
  • ఆహార నియమాలు: ఏ ఆహారం ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి.

అష్టాంగ హృదయం (Ashtanga Hridayam) ఒక వైద్య గ్రంథం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవనానికి మార్గదర్శి కూడా. దీన్ని చదివితే ఆయుర్వేదం అంటే కేవలం మందులు తీసుకోవడం కాదని, ఆరోగ్యంగా ఉండటానికి పాటించాల్సిన జీవన విధానం అని అర్థమవుతుంది.


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments