Friday, February 20, 2026
#
HomeCinemaMahavatar Narsimha Movie Collections: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న మహావతార్‌ నరసింహ

Mahavatar Narsimha Movie Collections: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న మహావతార్‌ నరసింహ

Mahavatar Narsimha Movie Collections: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘మహావతార్ నరసింహ’

ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ని ఓ యానిమేషన్ సినిమా ఊపేస్తోంది. అదే ‘మహావతార్ నరసింహ’. కేవలం రూ. 1.5 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లతో మొదలైన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. కథలో సత్తా ఉంటే, పెద్ద స్టార్లు అవసరం లేదని మరోసారి నిరూపించింది ఈ మూవీ. అంతేకాదు, భారతదేశంలోనే మొట్టమొదటి భారీ యానిమేషన్ సినిమాగా ఇది చరిత్ర సృష్టించడం విశేషం.

రూ. 15 కోట్ల బడ్జెట్‌తో అద్భుతం

కన్నడలో రూపొందిన ఈ సినిమాకి దర్శకుడు అశ్విన్ కుమార్. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో ఈ యానిమేషన్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా తీసేటప్పుడు ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారట. ‘దేవుడి సినిమాని ఇప్పుడు ఎవరు చూస్తారు?’ అని చాలా మంది నిరుత్సాహపరిచారట. కానీ అశ్విన్ కుమార్ తన నమ్మకాన్ని వదులుకోలేదు. తన దగ్గరున్నదంతా పెట్టి ఈ సినిమాని రూపొందించారు. ఆయన క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కి, హోంబలే ఫిల్మ్స్ వాళ్లు తోడయ్యారు. కథపై నమ్మకంతో వాళ్ళు ఈ సినిమాను సమర్పకులుగా విడుదలకు సహాయం చేశారు. ఇప్పుడు ఆ నమ్మకమే బాక్సాఫీస్‌ వద్ద సింహంలా గర్జిస్తోంది.

ఎవడు చూస్తాడు అన్నారు, 16రోజులగా బాక్సాఫీస్ ని షేక్‌ చేస్తూ వసూళ్ల సునామి సృష్టిస్తోంది.

కలెక్షన్ల సునామీ! (Mahavatar Narsimha Movie Collections)

‘మహావతార్ నరసింహ’ సినిమా జూలై 25న విడుదలైంది. కన్నడతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. సినిమా విడుదల అవుతుందని పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 1.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ, సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో నెమ్మదిగా పుంజుకుంది. రోజుకు రూ. 1.5 కోట్లనుంచి రూ. 4 కోట్లు, రూ. 5 కోట్లు, రూ. 7 కోట్లు, రూ. 10 కోట్ల వరకు కలెక్షన్లు పెరిగాయి. కేవలం 16 రోజుల్లోనే ఏకంగా రూ. 175 కోట్లు రాబట్టింది. ఈ వీకెండ్‌లో కూడా వసూళ్లు తగ్గలేదు. ఈ సినిమా కలెక్షన్లు చూసి మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు.

రూ. 200 కోట్ల దిశగా ‘మహావతార్ నరసింహ’

ఈరోజుల్లో చాలా సినిమాలు వీకెండ్‌లో ఆడితే గొప్ప. మొదటి వారం నిలబడితే గ్రేట్. బడ్జెట్ తిరిగి వస్తే బ్లాక్ బస్టర్ అంటారు. కానీ ‘మహావతార్’ మాత్రం ఏకంగా మూడు వారాలుగా అదే జోరు చూపిస్తోంది. రోజురోజుకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. పెట్టిన బడ్జెట్‌కి ఏకంగా 12 రెట్లు ఎక్కువ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా జోరు చూస్తుంటే, రూ. 200 కోట్లు చాలా సులువుగా కొల్లగొట్టేస్తుందని చెప్పవచ్చు. బహుశా అంతకు మించి కూడా కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దర్శకుడు అశ్విన్ కుమార్ నమ్మకమే ఈ సినిమా ఈ రేంజ్ సంచలనాలు సృష్టించడానికి కారణం అని చెప్పొచ్చు.

సైబర్ ఫ్రాడ్ అలర్ట్ – జాగ్రత్త: సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు!:

సైబర్ నేరగాళ్లు రకరకాల కొత్త పద్ధతులతో మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు నాట్‌వీతెలుగు.కామ్ నడుం బిగించింది.

అప్రమత్తంగా ఉండండి! సురక్షితంగా ఉండండి!

మొత్తం 7 సినిమాలు రానున్నాయి!

ఈ ‘మహావతార్’ సిరీస్‌లో మొత్తం ఏడు సినిమాలు రాబోతున్నాయి. సుమారు 12 ఏళ్ల పాటు వరుసగా ఈ చిత్రాలు వస్తాయి. విష్ణువు అవతారాల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పుడు మనం చూసింది నరసింహ అవతారం గురించి. రాబోయే సినిమాలు ఇవే:

  • 2027లో – ‘మహావతార్ పరశురామ్’
  • 2029లో – ‘మహావతార్ రాఘనందన’
  • 2031లో – ‘మహావతార్ ద్వారకాధీష్’
  • 2033లో – ‘మహావతార్ గోకులనంద’
  • 2035, 2037లో – ‘మహావతార్ కల్కి’ (రెండు భాగాలుగా)

మొదటి సినిమానే ఈ స్థాయిలో ఆడితే, రాబోయే పార్టులు ఇంకెంత పెద్ద సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. మీరేమంటారు?


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments