Ustaad Bhagat Singh New Update: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ . ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Ustaad Bhagat Singh New Update: ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ అప్డేట్:
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఎడిటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ ఆదివారం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ను (Pawan Kalyan) ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా చూపించబోతున్నామని, అభిమానులు పెద్ద ఫీస్ట్‌కి సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ సినిమాలో పవన్ ఒక స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల (Sreeleela), రాశీ ఖన్నా (Raashii Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, నాగ మహేశ్, టెంపర్ వంశీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
ఇక, పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. దీనికి సినిమాటోగ్రఫీ అయనంక బోస్, ఎడిటింగ్ ఛోటా కె ప్రసాద్ చేస్తున్నారు.
సైబర్ ఫ్రాడ్ అలర్ట్ – జాగ్రత్త: సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు!:
సైబర్ నేరగాళ్లు రకరకాల కొత్త పద్ధతులతో మిమ్మల్ని మోసం చేయడానికి, డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండేందుకు నాట్‌వీతెలుగు.కామ్ నడుం బిగించింది.
అప్రమత్తంగా ఉండండి! సురక్షితంగా ఉండండి!


