War 2 Review: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కలిస్తే థియేటర్లలో అగ్గి పుట్టాల్సిందే! యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ, హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, యాక్షన్ తో దుమ్ములేపడం.. ఇవన్నీ “వార్ 2” (War 2 Movie) సినిమాపై అభిమానుల్లో ఊహించని ఉత్సాహాన్ని నింపాయి. మరి మన తారక్, హృతిక్ ఇద్దరూ కలిసి ప్రేక్షకులకు కోసం సిల్వర్ స్క్రీన్ మీద ఎంత దుమ్ములేపరో తెలుసుకుందాం.
కథ ఏంటంటే? (War 2 Movie Story)
ఇండియాను అస్థిరపరచాలని చూసే ‘కలి’ అనే ఇంటర్నేషనల్ సిండికేట్‌తో కబీర్ (హృతిక్ రోషన్) చేరినట్లు ప్రభుత్వానికి తెలుస్తుంది. ‘రా’ ఏజెంట్ అయిన కబీర్ తన గురువును కూడా చంపడంతో దేశద్రోహిగా ముద్ర పడుతుంది. ఈ క్రమంలో, కబీర్‌ను పట్టుకోవడానికి అత్యంత సమర్థుడైన ‘రా’ ఆఫీసర్ విక్రమ్ (ఎన్టీఆర్)ను రంగంలోకి దింపుతారు. కబీర్ వెనుక ఉన్న నిజం ఏమిటి? విక్రమ్ కు ఎదురైన షాకింగ్ నిజాలు ఏమిటి? చివరికి దేశాన్ని కాపాడింది ఎవరు? ఈ మిషన్ లో కబీర్, విక్రమ్ పాత్రలు ఏంటి? అనేదే ఈ సినిమా కథ.
నటీనటుల పనితీరు (Artists Performance in War 2 Movie)
హృతిక్ రోషన్ (Hrithik Roshan) కబీర్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ రెండింటిలోనూ తన అనుభవాన్ని చూపించాడు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్ లో హృతిక్ తన మార్క్ చూపించాడు.
ఎన్టీఆర్ (Jr. NTR)తన మొదటి హిందీ సినిమాలో స్టైలిష్ ఎంట్రీతో ఆకట్టుకున్నాడు. విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ లో చూపించిన ఎమోషనల్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎన్టీఆర్ లుక్ విషయంలో కొన్ని చోట్ల మైనస్ అనిపించినా, యాక్షన్ సీక్వెన్స్‌లో మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా చేశాడు.
కియారా అద్వానీ (Kiara Advani) గ్లామర్ పరంగానే కాకుండా కథలో కీలకమైన పాత్రలో కూడా బాగా నటించింది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్ (War 2 Movie Highlights)
- యాక్షన్ సీన్స్: సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అని చెప్పొచ్చు. ట్రైన్, ఫ్లైట్ సీక్వెన్స్ లాంటివి అద్భుతంగా ఉన్నాయి.
- హృతిక్-ఎన్టీఆర్ కాంబినేషన్: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లలో పూనకాలే! ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు!ఎనర్జీ వేరే లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వారిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండాయి.
- సాంకేతిక విలువలు: సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఇది ఒక స్పై థ్రిల్లర్ కు కావాల్సిన ఫీల్‌ను ఇచ్చింది.
మైనస్ పాయింట్స్
- కథనం రొటీన్ గా ఉండడం: కథలో పెద్దగా కొత్తదనం కనిపించలేదు. గతంలో వచ్చిన స్పై సినిమాలు గుర్తుకొస్తాయి.
- పాటలు: హృతిక్, ఎన్టీఆర్ లాంటి గొప్ప డాన్సర్స్ ఉన్నా కూడా పాటలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
- కనెక్ట్ అవ్వకపోవడం: మన తెలుగు ఆడియన్స్ కు కొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.
ఫైనల్గా ఎలా ఉందంటే? (How is War 2 Review)
“వార్ 2” అనేది ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. భారీ యాక్షన్ సీన్స్, ఇద్దరు స్టార్ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఈ సినిమాను చూడొచ్చు. పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ కాకపోయినా, ఈ వీకెండ్ లో యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది మంచి టైంపాస్. ఈ సినిమా చివరిలో ఇచ్చిన హింట్ తో స్పై యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని అర్థమవుతుంది.
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


