HomeNewsActress Kasturi Political Entry: రాజకీయాల్లోకి హీరోయిన్‌ కస్తూరి

Actress Kasturi Political Entry: రాజకీయాల్లోకి హీరోయిన్‌ కస్తూరి

Actress Kasturi Political Entry: ఒకప్పుడు సౌత్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటి కస్తూరి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

సినిమాలతో పాటు సమాజంలో జరిగే విషయాలపైనా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే కస్తూరి, తాజాగా బీజేపీలో చేరారు. చెన్నైలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, నటి కస్తూరితో పాటు సామాజిక కార్యకర్త నమితా మారిముత్తు కూడా బీజేపీలో చేరడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. వీరి రాక తమిళనాడులో బీజేపీని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కస్తూరికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా కస్తూరి ఎదిగారు. ప్రస్తుతం ఆమె సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ, టీవీ షోలలో కూడా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కస్తూరి, తన బోల్డ్ ఒపీనియన్స్ వల్ల చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆమె రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కస్తూరి పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments