Akhanda 2 Release Date: మన తెలుగు సినిమా ప్రపంచం ఒక మహా యుద్దానికి సిద్ధమవుతోంది. ఆ యుద్ధానికి నాయకుడు ఎవరు? ఆ యుద్దంలో మనల్ని మైమరపించేది ఏది? ఇంకేంటి, మన నటసింహం “GOD OF MASSES” నందమూరి బాలకృష్ణ గారే! బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు, సింహా, లెజెండ్ మరియు అఖండ, మన తెలుగు సినీ చరిత్రలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాయి. ఈసారి ఆ కాంబో ఒక మాయాజాలం సృష్టించడానికి వస్తుంది. అఖండ 2 సినిమాతో, మన బాలయ్య బాబు మరోసారి అఘోర గెటప్ లో, అంతకుమించి పవర్ ఫుల్ గా మనల్ని అలరించడానికి వస్తున్నారు.
అఖండ సినిమా వచ్చినప్పుడు దాని విజయం చూసి తెలుగు సినిమా ప్రపంచం ఆశ్చర్యపోయింది. కేవలం బాలయ్య బాబు గర్జన, ఉగ్ర రూపం, అఘోర గెటప్, ఈ మూడు మనల్ని థియేటర్లో సీట్ మీద నుంచి లేచి డాన్స్ చేసేలా చేసాయి. ఇప్పుడు అదే అఖండ కు సీక్వెల్ వస్తుంది అంటే, మన అభిమానుల గుండెలు ఎలా కొట్టుకుంటాయో ఊహించుకోవచ్చు.
వాయిదా పడిన అఖండ 2: అందుకే ఆలస్యమైన ఆనందం (Akhanda 2 Release Date)
దసరా పండుగ రోజున అఖండ 2 సినిమా గురించి ఒక అద్భుతమైన అప్డేట్ వస్తుందని అందరూ ఎదురు చూసారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ అప్డేట్ రాక మనల్ని నిరాశపరిచింది. అయితే, మన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, ఆ నిరాశను సంతోషంగా మార్చారు. దసరా సందర్భంగా, అఖండ 2 టీం ఒక కొత్త పోస్టర్ ను మరియు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆ పోస్టర్ చూసి, #NandamuriBalakrishna ఫ్యాన్స్ మళ్ళీ పండగ చేసుకున్నారు. ఆ ఘోరమైన లుక్, ఆ కళ్ళు, ఆ పవర్, నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈసారి బాక్సాఫీస్ తాండవం చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి.
డిసెంబర్ 5న అఖండ 2 విజువల్ ట్రీట్ (Akhanda 2 Release Date)
డిసెంబర్ 5, 2025 న అఖండ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి వచ్చిన అప్డేట్స్ నిజంగా మనల్ని ఆశ్చర్యపరిచేవి. అఘోర గెటప్ లో బాలయ్య బాబు హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేసే సీన్, ఆ తరువాత వచ్చే ఇంట్రో సీన్, ఇవన్నీ మనల్ని థియేటర్లో కనురెప్పలు కూడా వదలకుండా చూసేలా చేస్తాయంట.
బాలయ్య బాబు రెమ్యునరేషన్ లో మరో లెక్క (Akhanda 2 Release Date)
సినిమాకు వచ్చిన భారీ విజయం, అభిమానుల ఆశలు, ఇవన్నీ బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ ను కూడా పెంచాయి. అఖండ సినిమాకు రూ. 28 కోట్లు తీసుకున్న బాలయ్య బాబు, అఖండ 2 సినిమాకు ఏకంగా రూ. 35 కోట్లు తీసుకుంటున్నారని టాక్. ఇది నిజం అయితే, బాలయ్య బాబు రెమ్యునరేషన్ లో మరో రికార్డ్ అవుతుంది. ఈసారి అఖండ 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా, బాలయ్య బాబు రెమ్యునరేషన్ తో కూడా సరికొత్త చరిత్ర సృష్టించవచ్చు.


