HomeNewsPaying Credit Card Bill On Time: క్రెడిట్ కార్డ్ బిల్లు టైమ్‌కి కడితే...

Paying Credit Card Bill On Time: క్రెడిట్ కార్డ్ బిల్లు టైమ్‌కి కడితే…

Paying Credit Card Bill On Time: క్రెడిట్ కార్డ్ బిల్లు టైమ్‌కి కడితే… మీ అకౌంట్‌లో పండుగే!

క్రెడిట్ కార్డ్ బిల్లు గడువు తేదీ గురించి టెన్షన్ పడుతున్నారా? పడకండి! దాన్ని కరెక్ట్‌గా టైమ్‌కి కట్టేశారంటే, మీ జాతకం మారిపోతుంది. అట్లంటది, బ్యాంకు వాళ్ళతోని!

1. మీ ‘క్రెడిట్ స్కోర్’కి గోల్డ్ మెడల్!

మీరు క్రెడిట్ బిల్లును కరెక్ట్‌గా టైమ్‌కి కట్టేశారంటే, బ్యాంక్ వాళ్లు మీ ‘క్రెడిట్ ప్రొఫైల్’ (Credit Profile) మీద బంగారు అక్షరాలతో ‘మంచి కస్టమర్’ అని రాస్తారు. దీన్నే మనం అట్టహాసంగా క్రెడిట్ స్కోర్ (Credit Score) అంటాం. ఇది ఎంత బాగా పెరిగిందంటే, మీరు ఫైనాన్షియల్ ప్రపంచంలో ఒక ‘స్టార్’ హీరో (Star Hero/Credit Hero) లాంటి వాళ్లు అన్నమాట. బ్యాంకులు ఎగబడతాయి!

Paying Credit Card Bill On Time naatv telugu

2. లోన్లు కావాలా? “అరే, మా వాడే!” అని బ్యాంకులు క్యూ కడతాయి!

మీ క్రెడిట్ స్కోర్ అదిరిపోయిందంటే, రేపు మీరు ఇంటి లోన్ (Home Loan), కారు లోన్ (Car Loan), లేదా ఏ లోన్ అడిగినా బ్యాంకులు ఎర్ర తివాచి పరిచి మరీ స్వాగతం చెప్తాయి. “అరే, మా వాడే కదా! కరెక్ట్‌గా కట్టేస్తాడు” అని తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చి పంపేస్తాయి.

3. వడ్డీ అనే గుదిబండ, లేట్ ఫీజు అనే భారం… మీ దరి చేరవు!

క్రెడిట్ బిల్లును కరెక్ట్‌గా కట్టేశారంటే, వడ్డీ అనే గుదిబండ (Interest) మీ నెత్తిన పడదు. లేట్ ఫీజు అనే భారం (Late Fee Burden) మీ జోలికి రాదు. ఆ రెండు మీ అకౌంట్‌లోకి ఎంటర్ కావాలంటేనే హడలిపోతాయి! లేదంటే, ఇవి మీ జేబును ఖాళీ చేసేసి, పీల్చి పిప్పి చేస్తాయి. చూశారా, టైం కి క్రెడిట్ కార్డు బిల్ కడితే, మీ డబ్బు ఎంత సేఫో!

4. ఆర్థిక ‘యోగి’ అవుతారు!

ప్రతి నెలా క్రెడిట్ బిల్లును టైమ్‌కి కట్టడం అంటే, మీరు ఒక రకమైన ఆర్థిక ‘యోగ సాధన’ చేస్తున్నట్టే! ఖర్చులు ఎలా కంట్రోల్ చేయాలో, ఎప్పుడు ఏది కొనాలి అనేది మీ మెదడుకు ట్రైనింగ్ ఇస్తున్నట్టే. ఇలా చేస్తే, భవిష్యత్తులో మీరు ఫైనాన్షియల్ గురూజీ (Financial Guruji) అవుతారు, చూసుకోండి మరి!

5. క్రెడిట్ కార్డు ‘వరాలు’… అన్నీ మీ కోసమే!

చాలా క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్లు (Reward Points), క్యాష్‌బ్యాక్ (Cash Backs), సూపర్ ఆఫర్లు (Super Offers), ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు ఉచిత ఎంట్రీ (Airport Lounge Free Entry)లాంటి వరాలు ఇస్తాయి. మీరు టైమ్‌కి బిల్లులు కడుతూ ఉంటే, ఈ వరాలన్నీ మీకే సొంతం అవుతాయి. లేదంటే, వడ్డీలు, ఫీజులకే చాలా డబ్బు పోతుంది, అప్పుడు ఈ వరాలు శాపాలవుతాయి!

6. మీ ‘క్రెడిట్ లిమిట్’ స్పీడ్ పెరుగుతుంది! (కానీ బ్యాలెన్స్ ముఖ్యం!)

మీరు కరెక్ట్‌గా కడుతూ ఉంటే, బ్యాంకులు మీ క్రెడిట్ లిమిట్‌ను ఆటోమేటిక్‌గా పెంచుతాయి. అంటే, మీరు ఎక్కువ ఖర్చు పెట్టొచ్చు అన్నమాట! ఇది ఒక రకంగా ‘బటర్‘ లాంటిది. కానీ, ఇక్కడే మన జాగ్రత్తగా ఉండాలి. లిమిట్ పెరిగిందని ఇష్టం వచ్చినట్లు వాడేసి, మళ్లీ టైమ్‌కి కట్టలేకపోతే అంతే సంగతులు. బ్యాంకు వాళ్ళు “రక్త కన్నీరు” సినిమా చూపిస్తారు.

మొత్తంగా చెప్పాలంటే, క్రెడిట్ కార్డు బిల్లును టైమ్‌కి కట్టడం అంటే మీ ఫైనాన్షియల్ కెరీర్‌కు పునాది వేసినట్టే! అందుకే, ఆ విషయంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వొద్దు.

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments