isro aditya L1 spacecraft
Spread the love

తొలి ప్రయతంలోనే తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది. శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ  (ISRO) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సెప్టెంబర్‌ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1 (Aditya L1) వ్యోమ నౌక 127 రోజులపాటు సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈరోజు (01-06-2024) సాయంత్రం నాలుగు గంటల సమయంలో తుది కక్ష్యలోకి ప్రవేశించింది.

సూర్యుడికి సమీపంలోని లాంగ్రాజ్ పాయింట్ హాలో ఆర్బిట్‌లోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. విజయవంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశించి మరో మెయిలు రాయిని సాధించింది. అంకిత భావం తో పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోడీ ప్రశంసించారు.

ఆదిత్య ఎల్-1 ఎం చేస్తుంది?

సూర్యుడి గురించిన ఎన్నో విషయాలను సేకరించి భూమికి పంపుతుంది. సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ , సౌర తుఫానులను కనిపెడుతుంది. శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త పడేలా చేస్తుంది.

 

లేటెస్ట్ న్యూస్ అప్ డేట్స్ కోసం నా టీవీ తెలుగు ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

నా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సందర్శించండి


Spread the love