Friday, February 20, 2026
#
HomeNewsKota Srinivasa Rao died: కోటా శ్రీనివాసరావు ఇకలేరు

Kota Srinivasa Rao died: కోటా శ్రీనివాసరావు ఇకలేరు

Kota Srinivasa Rao died: పద్మశ్రీ (Padmasri Award Winner) పురస్కార గ్రహీత, 9 సార్లు నంది అవార్డు (Nandi Award Winner) సుప్రసిద్ధ నటులు, సైమా అవార్డు గ్రహీత (Saima Award Winner), మాజీ భాజపా ఎమ్మెల్యే (BJP MLA) అంతకుమించి, రంగస్థల నటుడు (Stage Artist), విలనిజానికి (Villan) కొత్త అర్థం చెప్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి, మన Kota Srinivasa Rao కోటా శ్రీనివాసరావు (83) తన నివాసంలో కన్నుమూశారు (Kota Srinivasa Rao died). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుఝామున స్వర్గస్తులైనారు.

4 దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 750కి పైగా చిత్రాలలో (kota srinivasa rao movies) నటించారు. ఆయన మొదటి చిత్రం ప్రాణంఖరీదు. చిరంజీవితో కలిసి తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎందరో అగ్రహీరోలతో కలిసి నటించారు. ముక్కుసూటి మనస్తత్వం. ఉన్నది ఉన్నట్టుగా మొహాన చెప్పడంతో చాలామందికి కోటాగారు నచ్చరు. యదార్ధవాది లోకవిరోధి కదా!

ఆయన తెలంగాణ యాసలో చెప్పే రామాయణం విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గబ్బర్ సింగ్ చిత్రంలో “మందుబాబులం…” పాటపాడటం విశేషం. ఒక క్యారెక్టర్ ఆరిస్టుకి పాటలు ఉండటం అరుదు. అలాంటిది, ఆయన కొన్ని పాటల్లో మెప్పించారు. అందులో మనీ చిత్రంలోని “భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు…’ పాట విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది.

ఆమె (aame), అహనాపెళ్ళంట (Aha Naa Pellanta movie), మనీ (Money movie), గాయం (Gayam movie) , ప్రతిఘటన (pratighatana movie), రౌడఅల్లుడు (Rowdy Alludu Movie), హలోబ్రదర్ (Hello Brother movie) , ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు Intlo illalu vantitlo priyuralu, ఆడువారిమాటలకు అర్థాలేవేరులే, చెప్పుకుంటూ పోతో ఎన్నొచిత్రాలతో తన నటనతో కట్టిపడేశారు. ప్రత్యేకంగా కోటా కోసం పాత్రలు సృష్టించేవారు. తమ సినిమాలో (kota villan roles) విలన్ పాత్ర ఆయనే చెయ్యాలి అని వెయిట్ చేసి చేయించుకునేవారు. అలసిపోకుండా, నిద్రాహారాలు మాని రోజుకి 6సినిమాలు చేసేవారు.

2010 జూన్ 21న తన కుమారుడు కోట ప్రసాద్ Kota prasad రోడ్డు ప్రమాదంలో మరణంతో అయన్ని తీవ్రంగా కృంగిపోయారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు (kota family).

కళామతల్లి సైతం TFI కన్నీరు పెట్టే విలక్షణమైన నటుడు కోటాశ్రీనివాసరావు నిష్క్రమించటం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తోంది నాటివి తెలుగు.

  • “తెలుగు వార్తలు, సినిమా అప్‌డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
  • నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.

📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments