HomeNewsACTRESS B SAROJA DEVI PASSES AWAY: నటి సరోజాదేవి కన్నుమూత

ACTRESS B SAROJA DEVI PASSES AWAY: నటి సరోజాదేవి కన్నుమూత

కోట శ్రీనివాస రావు మరణం మరిచిపోకముందే దక్షిణ భారత సినిమా రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి బి. సరోజాదేవి (87) తన నివాసంలో కన్నుమూశారు (B SAROJA DEVI PASSES AWAY). వృధాప్యం వలన వచ్చిన అనారోగ్యంతో మరణించారు.
1969లో పద్మశ్రీ (Padmasri), 1992లో పద్మభూషణ్ (Padma Bhushan), బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్, జాతీయ అవార్డు అందుకున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దిగ్గజ హీరోలతో ఎన్నో చారిత్రక, భక్తి 200 కు పైగా చిత్రాల్లో నటించారు.

శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకుని, 1955లో “మహాకవి కాళిదాస” అనే కన్నడ చిత్రంతో 13 ఏళ్ళ వయసులోనే నటిగా సినీ రంగంలోకి ప్రవేశించారు సరోజాదేవి ‘Abhinaya Saraswathi’. తెలుగులో సరోజాదేవి (Saroja devi) నటించిన మొదటి చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’.

సరోజాదేవి నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలు (B Saroja devi’s hit Movies)

తరువాత ‘భూకైలాస్‌’, ‘పెళ్లిసందడి’ , ‘జగదేకవీరునికథ’, పండంటి కాపురం, ఇంటికి దీపం ఇల్లాలే, అమరశిల్పి జక్కన్న, దాగుడుమూతలు ‘మంచి చెడు’, ‘శకుంతల’, ‘సీతారామకల్యాణం’, ‘దానవీరశూరకర్ణ’, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ వంటి ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాల్లో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లతో కలిసి నటించారు సరోజాదేవి. ‘శెభాష్‌ మీనా’, ‘పుది పరవై’ శివాజీ గణేషన్‌తో, ఎంజీఆర్‌తో 26 చిత్రాలలో నటించారు. 161 చిత్రాల్లో హీరోయిన్గా నటించడం అంటే మాటలు కాదు.

సరోజాదేవి ఆకస్మిక మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మకు శాంతి చేకూరాలని నాటివి తెలుగు ప్రార్ధిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments