singeetham srinivasa rao: భారతీయ సినీ ప్రపంచంలో ప్రయోగాలకు మారుపేరుగా నిలిచి, తరతరాల ప్రేక్షకులను అలరించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు (94) ఇకలేరన్న వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో శనివారం రాత్రి కన్నుమూశారు. సినిమాని ప్రాణంగా ప్రేమించిన ఆయన, చివరి శ్వాస వరకు కలంతో, కెమెరాతోనే ప్రయాణించారు. వయసు తొంబై దాటినా తగ్గని ఉత్సాహంతో నాగ అశ్విన్ నిర్మించిన ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించి, 94 ఏళ్ల వయసులో సినిమా తీసిన తొలి భారతీయ దర్శకుడిగా సరికొత్త రికార్డు సృష్టించారు.


