Sir Madam OTT: సినిమా అభిమానులకు ఒక సంతోషమైన వార్త! థియేటర్లో మిస్ అయిన వాళ్ల కోసం, అప్పుడే ‘సార్ మేడమ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అవును, మీరు విన్నది నిజం. ఇది ‘తలైవా తలైవి’ అనే తమిళ సినిమాకి డబ్బింగ్. ఈ సినిమా ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ (Amazon Prime Video) అవుతుంది.
ఇంతకీ కథేంటంటే… (Sir Madam OTT-Sir Madam Movie Story)
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఒక పరోటా మాస్టర్. వీరయ్య పరోటాలు తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందట. అలాంటి వీరయ్యకి పక్క ఊరి నుంచి ఒక సంబంధం చూస్తారు. ఆ అమ్మాయి పేరు రాణి (నిత్యా మేనన్ – Nithya Menen). వీళ్ళిద్దరూ పెళ్లి చూపుల్లోనే ఒకరికొకరు నచ్చేస్తారు. కానీ ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటివల్ల ఈ పెళ్లి వద్దనుకుంటారు.
ఐతే, మన హీరో హీరోయిన్లు ఏమీ తగ్గేదేలే అని, పెద్దవాళ్ళని కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు. కొత్తలో వీళ్ళ కాపురం బాగానే ఉంటుంది. కానీ, ఎక్కడ మొదలైందో తెలియదు, ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఈ గొడవలు ఓ దశ దాటాక చిలికి చిలికి గాలివానలా మారి, వీళ్ళిద్దరి కుటుంబాల మధ్య పెద్ద గొడవగా మారుతుంది.
చివరికి గొడవలు తారస్థాయికి చేరుకుని, విడాకుల వరకు వెళ్తారు. అసలు ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి? మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటయ్యారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే, సినిమా చూడాల్సిందే! ఈ సినిమాలో యోగి బాబు, రోషిని హరిప్రియన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. సో, సిద్ధంగా ఉండండి… ఈ కామెడీ అండ్ ఎమోషనల్ రైడ్ మిస్ అవ్వకండి!
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


