50 Years Of Sholay: ట్రెండ్ సెట్ చేసిన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ “షోలే”!
సినిమా అంటే కేవలం కథ కాదు. అది ప్రజల జ్ఞాపకాల్లో కలకాలం నిలిచిపోయే ఓ అనుభూతి. సరిగ్గా 50 ఏళ్ల క్రితం విడుదలైన ‘షోలే’ (Sholay) అలాంటి ఒక అద్భుతం. ఈ సినిమా చూసినా, చూడకపోయినా, ఈ పేరు వినని వాళ్లు ఉండరు. ఎందుకంటే, ఇది కేవలం సినిమా కాదు, భారతీయ సినిమా చరిత్రను ‘షోలేకి ముందు’, ‘షోలేకి తర్వాత’ అని విభజించేంత ప్రభావం చూపించింది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ కలగలిపిన ఒక ‘అద్భుతమైన విందు భోజనం’. 50 ఏళ్లు గడిచినా, ఇందులోని పాత్రలు, డైలాగులు, పాటలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.
అంచనాలను తల్లకిందులు చేసిన జైత్రయాత్ర – 50 Years of Sholay
1975 ఆగస్టు 15న విడుదలైన షోలే, ఈరోజుకి 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఊహించని మౌత్ టాక్తో విజయాన్ని సాధించింది. అప్పటివరకూ చూసిన సినిమాలకు భిన్నంగా, గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథను సలీం-జావేద్ అద్భుతంగా రాశారు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra), హేమామాలిని (Hema Malini), అమ్జద్ ఖాన్ (Amjad Khan), సంజీవ్ కుమార్ (Sanjeev Kumar) స్టార్స్ పోటీపడి నటించిన చిత్రం ‘షోలే’.
తెరవెనుక కథలు.. (Behind Story of Sholay) అసలు మజా ఇక్కడే! 50 Years Of Sholay
షోలే మేకింగ్ జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రమేష్ సిప్పీ, సలీం-జావేద్‌లకు అకీరా కురసోవా తీసిన ‘సెవెన్ సమురాయ్’ (Seven Samurai) సినిమా స్ఫూర్తినిచ్చింది. మొదట, ‘జై’ పాత్ర కోసం శత్రుఘ్న సిన్హాతో సహా చాలా మందిని అనుకున్నారు. కానీ, చివరకు ‘జంజీర్’ (Zanjeer)లో అమితాబ్ నటన చూసి, ఆయన్ని ఎంపిక చేశారు.
- షూటింగ్ మొదటి రోజునే జోరున వాన పడటంతో ఒక్క షాట్ కూడా తీయలేకపోయారట.
- సినిమా షూటింగ్ సమయంలోనే జయా బచ్చన్ గర్భవతి. అందుకే ఆమె కూతురు కూడా ఈ సినిమాలో నటించిందని అమితాబ్ సరదాగా చెబుతుంటారు.
- హేమామాలినితో ఎక్కువ సమయం గడపాలని ధర్మేంద్ర కావాలనే ఎక్కువ టేక్స్ తీసుకునేవారట.
‘యే దోస్తీ హమ్ నహీ చోడేంగే’ (ye dosti hum nahi todenge) పాట కోసం ఏకంగా 21 రోజులు షూట్ చేశారు. అలాగే ట్రైన్ రాబరీ సీన్ ఏడు వారాలు పట్టిందంటే నమ్మలేం! సినిమాపై రమేష్ సిప్పీకి ఉన్న ప్యాషన్, పర్ఫెక్షన్ కోసం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
గబ్బర్ సింగ్ (Gabbar Singh): విలనిజానికి కొత్త నిర్వచనం (50 Years Of Sholay)
‘షోలే’లో అందరినీ ఆకట్టుకున్న మరో విషయం గబ్బర్ సింగ్ పాత్ర. నెగెటివ్ పాత్రకు కూడా ఇంత ఫాలోయింగ్ ఉంటుందా అని ఆశ్చర్యపరిచిన పాత్ర ఇది. గబ్బర్ సింగ్ పాత్రకు మొదట డానీ డెంజోంగ్పను అనుకున్నారు. కానీ, ఆయన బిజీగా ఉండటంతో ఆ అవకాశం అమ్జద్ ఖాన్‌కు (amjad khan gabbar singh sholay) దక్కింది.
- “కిత్నే ఆద్మీ థే”
- “జో డర్ గయా, సంజో మర్ గయా”
ఇలాంటి డైలాగులు జనాల భాషలో ఒక భాగమైపోయాయి. ఈ సినిమా తర్వాత చాలా మంది దర్శకులు గబ్బర్ సింగ్ తరహా విలన్ పాత్రలను సృష్టించారు.
అద్భుతమైన పాటలు, అమోఘమైన క్లైమాక్స్ – 50 Years of Sholay
ఆర్.డి. బర్మన్ సంగీతం, ఆనంద్ బక్షీ సాహిత్యం ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ‘మెహబూబా మెహబూబా’ (mehabooba song), ‘యే దోస్తీ’ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్.
అసలు క్లైమాక్స్ లో ఠాకూర్ గబ్బర్ ను చంపేస్తాడు. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల, క్లైమాక్స్ ను మార్చి పోలీసులు గబ్బర్ ను అరెస్ట్ చేసేలా చూపించారు.
‘షోలే’ (Sholay Movie) కేవలం ఒక సినిమా కాదు, అది మన జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ క్లాసిక్ ఫిలిం. దీనిని ఆస్వాదించాలే తప్ప, మాటల్లో వివరించడం కష్టం. రమేష్ సిప్పీ మాటల్లో చెప్పాలంటే, ‘షోలే’ విజయ రహస్యం ఎలా చెప్పాలో తెలియదు… కానీ దాన్ని ఆస్వాదించాలి’.
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


