HomeCinemaSundarakanda Review: ప్రేమ కథకు కొత్త నిర్వచనం.. అంతా రివర్స్!

Sundarakanda Review: ప్రేమ కథకు కొత్త నిర్వచనం.. అంతా రివర్స్!

Sundarakanda Review: సినిమా పేరు సుందరకాండ అని వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సీనియర్ వెంకటేశ్ సినిమా. ఆ సినిమాలో ఒక లెక్చరర్‌ని ప్రేమించిన అమ్మాయి కథ చూశాం. కానీ ఈ కొత్త Sundarakanda 2025 కథ దానికి పూర్తిగా రివర్స్! స్టూడెంట్‌ని ప్రేమించిన లెక్చరర్ కథతో దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి ఒక డేరింగ్ అటెంప్ట్ చేశారు.

చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో నారా రోహిత్, ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఈ కథను చాలా జాగ్రత్తగా, కన్విన్సింగ్‌గా చెప్పకపోతే ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. మరి దర్శకుడు, నిర్మాతలు సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి కలిసి ఈ రిస్క్‌ని ఎలా తీసుకున్నారు? సినిమా ఎలా ఉంది? Nara rohith సుందరకాండ రివ్యూ చూద్దామా! (Sundarakanda Movie review)

సుందరకాండ కథ: ప్రేమ కోసం తిరుగుతున్న ఒక సాఫ్ట్‌వేర్ సిద్ధార్థ్ (Sundarakanda Review)

కథానాయకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆయన వయసు దాదాపు 40కి దగ్గరలో ఉంది. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఆయనకు కాబోయే భార్యలో 5 ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలని డిసైడ్ అయిపోతాడు. ఈ లక్షణాల కోసం ఆయన చాలామంది అమ్మాయిలను రిజెక్ట్ చేస్తూ ఉంటాడు.

ఆ లక్షణాలు ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్లో తన సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్‌కుమార్)లో ఉన్న ఐదు మంచి లక్షణాలు. అవే తనకు కాబోయే భార్యలో ఉండాలని కోరుకుంటాడు. కుటుంబం, స్నేహితులు ఎంత చెప్పినా వినడు. ఇక ఒకరోజు, అమెరికా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు, ఐరా (వృతి వాఘాని)ని చూసి ఫస్ట్ లుక్‌లోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఇష్టపడతాడు.

అప్పటికప్పుడే అమెరికా ప్లాన్‌ని క్యాన్సిల్ చేసుకుని, ఐరాని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని ఫిక్స్ అవుతాడు. ఆమెను ఒప్పించి, తన తల్లితో పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్లినప్పుడు ఊహించని ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? సిద్ధార్థ్, ఐరా పెళ్లి జరుగుతుందా? లేదా? అనేది ఈ సినిమా కథ.

సుందరకాండ రివ్యూ: క్లాస్ టచ్‌తో కూడిన ఎమోషనల్ జర్నీ (Sundarakanda Review)

ఈ సినిమా పెళ్లిచూపుల సీన్‌తో మొదలవుతుంది. హీరో తన పంతానికి ఎంత కట్టుబడి ఉంటాడో చూపించారు. ఆ తర్వాత వైజాగ్‌కి కథ షిఫ్ట్ అవుతుంది. కథలోకి సత్య, బేబీ సునయన రాగానే సినిమా రన్ స్పీడ్ అందుకుంటుంది. అయితే, ఇంటర్వెల్ సమయానికి కథలో వచ్చే ట్విస్ట్, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చాలావరకు ప్రేక్షకులు ఊహించగలుగుతారు.

కానీ, ఈ సినిమా రెండో భాగం కూడా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఊహకు దగ్గరగా ఉన్నా, దర్శకుడు ఆ కథను ఎలా డీల్ చేస్తాడు అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు పెరుగుతుంది. ఈ ఆసక్తిని పెంచడంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డైలాగ్స్ ప్రధాన పాత్ర పోషించాయి.

మరీ ముఖ్యంగా, సత్య కామెడీ సినిమాకు పెద్ద ప్లస్. తన స్టైల్‌లో సింపుల్ డైలాగ్స్‌తోనే కామెడీని పండించి, ఆడియన్స్‌ను నవ్వించారు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా తన నటనతో అలరించారు. సిద్ధార్థ్, ఐరా, వైష్ణవి ముగ్గురి మధ్య సాగే ఈ సున్నితమైన పాయింట్‌ను దర్శకుడు చాలా సమర్థవంతంగా చెప్పారు. కథలో ఎక్కడైనా తడబడినా, ఆడియన్స్ ఆ పాయింట్‌ని డైజెస్ట్ చేసుకోలేరు. కానీ దర్శకుడు మంచి స్క్రీన్‌ప్లే, చక్కటి సన్నివేశాలతో కథను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. చివర్లో క్లాస్ పీకుతున్నట్లు అనిపించినా, ఎమోషనల్ సీన్స్ పండటంతో బోర్ ఫీల్ అవ్వం.

పర్ఫార్మెన్స్: మెరిసిన తారలు (Sundarakanda Review)

నారా రోహిత్: చాలా కాలం తర్వాత ఒక యూత్‌ఫుల్ పాత్రలో కనిపించారు. కొంచెం బరువు ఉన్నా, సిద్ధార్థ్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. వృతి వాఘాని: తన పాత్రలో గ్లామర్‌తో పాటు యాక్టివ్‌గా కనిపించింది.

శ్రీదేవి విజయ్‌కుమార్: ఈ సినిమాలో ఆమె పాత్ర హైలైట్. టీనేజ్ అమ్మాయిగా, టీనేజ్ దాటిన అమ్మాయికి తల్లిగా రెండు విభిన్న పాత్రలను పర్ఫెక్ట్‌గా చూపించారు. ఆమె నటనకు మంచి స్కోప్ లభించింది.

సత్య: ఈ సినిమాకి ప్రధాన ఎంటర్‌టైనర్. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. బేబీ సునయన కూడా మంచి పాత్రను పోషించింది. నరేశ్, రూపాలక్ష్మి తమ అనుభవాన్ని చూపించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అభినవ్ గోమటం బాగా నటించారు.

అజయ్, వీటీవీ గణేష్ తమ చిన్న పాత్రల్లో మెరిశారు.

టెక్నికల్ అంశాలు: ఫీల్-గుడ్ ఎలిమెంట్స్ (Sundarakanda Review)

ప్రదేశ్ ఎం. వర్మ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఫ్రేమ్స్ చాలా అందంగా ఉన్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం పర్వాలేదు. ‘డియర్ ఐరా’ పాట మాత్రం వినసొంపుగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.

సినిమాలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా, దర్శకుడు రాసుకున్న డైలాగ్స్, సన్నివేశాలు వాటిని కవర్ చేశాయి. కాలేజీ, సీమంతం సీన్స్‌లో కాస్త ఎడిటింగ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

ఫైనల్‌గా చెప్పాలంటే, Sundarakanda Movie ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నవ్వులు, ఎమోషన్స్ రెండూ పర్ఫెక్ట్‌గా మిక్స్ అయ్యాయి. హిట్ కోసం చూస్తున్న నారా రోహిత్‌కు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ అని చెప్పవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు.


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments