Renukaswamy Murder Case: కన్నడ పరిశ్రమతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక నిందితులు అప్రూవర్లుగా మారేందుకు ముందుకు రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలు ఏమిటీ Renukaswamy Murder Case? నేపథ్యం ఏంటి?
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి నటుడు దర్శన్‌కి అభిమాని. అయితే, దర్శన్ తన మొదటి భార్యతోనే ఉండాలని, పవిత్ర గౌడ వల్లే వారి సంసారంలో గొడవలు వస్తున్నాయని భావించిన రేణుకాస్వామి… పవిత్ర ఇన్స్టాగ్రామ్ ఖాతాకు అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైన దర్శన్, అతనికి బుద్ధి చెప్పాలని పథకం వేశాడు.తన అభిమాన సంఘం నాయకుడి ద్వారా రేణుకాస్వామిని బెంగళూరుకు రప్పించి, పటణగెరెలోని ఒక షెడ్డులో బంధించారు. అక్కడ దర్శన్, అతని అనుచరులు రేణుకాస్వామిపై అత్యంత దారుణంగా దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం మృతదేహాన్ని మురికికాల్వలో పడేసి, కేసు నుంచి తప్పించుకోవడానికి ఇతరులను లోంగిపోవాలని డబ్బులతో ఎర వేశారు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడటంతో 2024 జూన్ 11న దర్శన్, పవిత్ర గౌడలతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Renukaswamy Murder Case లో ట్విస్ట్… ఒకేసారి ముగ్గురు అప్రూవర్లుగా..
ఈ కేసులో A13 నిందితుడిగా ఉన్న ప్రదూష్ రావ్ తాను అప్రూవర్‌గా మారతానని, కేసులోని నిజాలన్నీ బయటపెడతానని సీసీహెచ్-59 కోర్టులో పిటిషన్ వేశాడు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని, తోటి నిందితుల నుంచి ప్రాణహాని ఉన్నందున తనను వేరే బ్యారక్‌కు మార్చాలని కోరాడు. ఇదే సమయంలో రవిశంకర్, వినయ్ అనే మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్లుగా మారేందుకు సిద్ధపడ్డారు.
చట్టపరంగా (CrPC 306/307) ఒకే కేసులో ఎంతమంది అయినా అప్రూవర్లుగా మారడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నేరాన్ని నిరూపించడానికి వారి సాక్ష్యం ఏ మేరకు అవసరమో పరిశీలించి అనుమతించే పూర్తి విచక్షణాధికారం కోర్టుకే ఉంటుంది.
అప్రూవర్‌గా మారితే శిక్ష పడదా?
అప్రూవర్‌గా మారిన వ్యక్తిని చట్టం “ప్రభుత్వ సాక్షి”గా పరిగణిస్తుంది. నేరంలో తన పాత్రతో పాటు, మిగిలిన నిందితులు చేసిన ప్రతి విషయాన్ని 100% నిజంగా కోర్టు ముందు చెప్తే వారికి పూర్తి క్షమాభిక్ష లభిస్తుంది. అయితే, విచారణ ముగిసేవరకు వీరు జైలులోని ప్రత్యేక బ్యారక్‌లోనే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ కోర్టులో అబద్ధం చెప్పినా లేదా మాట మార్చినా క్షమాభిక్ష రద్దయి, పాత నేరంతో పాటు అదనపు శిక్ష కూడా పడుతుంది.
దర్శన్, పవిత్ర గౌడలకు పెద్ద షాక్?
హత్య కేసుల్లో కంటితో చూసిన సాక్షులు దొరకడం చాలా అరుదు. కానీ, హత్య జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న సహ నిందితులే అప్రూవర్లుగా మారి సాక్ష్యమిస్తే, అది తిరుగులేని ప్రత్యక్ష సాక్ష్యంగా (Direct Evidence) మారుతుంది. కిడ్నాప్ ప్రణాళిక, హత్య జరిగిన తీరు, ఆధారాలు చెరిపేయడానికి చేసిన ప్రయత్నాలను వీరు కోర్టు ముందు బట్టబయలు చేస్తే, દર્షన్ మరియు పవిత్ర గౌడలు చట్టం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.
మొదట 6 నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందినప్పటికీ, 2025 ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో దర్శన్, పవిత్ర మళ్లీ జైలుపాలయ్యారు. ఇప్పటివరకు దాదాపు 18 నెలలకు పైగా జైలులోనే ఉన్న వీరిద్దరికీ, ఇప్పుడు సహ-నిందితులే సాక్షులుగా మారడం కోలుకోలేని పెద్ద దెబ్బగా మారింది.
అయ్యో ప్రదీప్ రావత్ అలా చనిపోయాడా? చివరి క్షణాలపై కొడుకు కన్నీటిపర్యంతం



