HomeNewsFree Drinking Water: అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లకు వాటర్ ఫ్రీ, ప్రభుత్వం కీలక ఉత్తర్వులు...

Free Drinking Water: అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లకు వాటర్ ఫ్రీ, ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

Free Drinking Water: మహారాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లకు ఉచితంగా, సురక్షితమైన తాగునీరు అందించడాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డిఏ (FDA) కమిషనర్ తుకారాం ముండే ఆదేశాల ప్రకారం ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.

Free Drinking Water ప్రధాన విషయాలు:

  • ప్రతి రెస్టారెంట్‌లో “ఉచితంగా సురక్షితమైన తాగునీరు లభిస్తుంది” అనే నోటీసు బోర్డును కస్టమర్లకు కనిపించేలా పెట్టాలి.
  • కస్టమర్లను ఖరీదైన వాటర్ బాటిళ్లు మాత్రమే కొనాలని బలవంతం చేయడానికి ఇకపై వీల్లేదు.
  • ఉచిత నీరు ఇవ్వకపోయినా, బోర్డులు పెట్టకపోయినా యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయి.
చాలాచోట్ల ఉచిత నీరు అడిగితే నాణ్యత లేని నీళ్లు ఇవ్వడం, లేదా నేరుగా వాటర్ బాటిళ్లు టేబుల్‌పై పెట్టి బిల్లు వేయడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి నిబంధనలే అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments