Pradeep Rawat Last Moments: నటుడు ప్రదీప్ రావత్ బ్లడ్ క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓషివారా శ్మశానవాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు ఆమిర్ ఖాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాజరై నివాళులర్పించారు.
అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ప్రదీప్ రావత్ కుమారుడు విక్రమాదిత్య మీడియాతో మాట్లాడుతూ తండ్రి చివరి రోజులను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Pradeep Rawat Last Moments – విక్రమాదిత్య మాటల్లోనే…
- ఆరంభంలో సాధారణ ఇన్ఫెక్షన్ అనుకున్నాం: మొదట కడుపులో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుకుని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాం. వారు ఇచ్చిన మందులు ఏవీ పనిచేయలేదు.
- ఒక్కసారిగా క్షీణించిన ఆరోగ్యం: ఒకరోజు నాన్నకు బాగోలేదని, అమ్మ టెన్షన్ పడుతూ కాల్ చేసి చెప్పింది. దాంతో ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం.
- నెలన్నరలోనే అంతా అయిపోయింది: కోకిలాబెన్ హాస్పిటల్‌లో జాయిన్ చేశాకే తెలిసింది.. అది చాలా ప్రాణాంతకమైన, వేగంగా వ్యాపించే అరుదైన బ్లడ్ క్యాన్సర్ అని. రెండు నెలల కిందట తీయించిన రిపోర్టులన్నీ క్లియర్‌గానే ఉన్నాయి, కానీ ఈ నెలన్నర రోజుల్లోనే నాన్నను క్యాన్సర్ మాకు కాకుండా చేసింది.
- ఐసీయూలో ఆఖరి క్షణాలు: ఆసుపత్రిలో డాక్టర్లు మమ్మల్ని హుటాహుటిన ఐసీయూ వైపు రమ్మన్నారు. వెళ్లేసరికి నాన్నకు సీపీఆర్ చేస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే ఆశలు వదులుకున్నాం. అమ్మ గుండె పగిలేలా ఏడ్చింది, చూస్తుండగానే అంతా అయిపోయింది.
తెలుగుతో పాటు వివిధ భాషల్లో దాదాపు 150కి పైగా చిత్రాల్లో విలన్‌గా, సహాయ నటుడిగా ప్రదీప్ రావత్ ప్రేక్షకులను మెప్పించారు.
నటుడు ప్రదీప్ రావత్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని NaaTV Telugu హృదయపూర్వక సంతాపం తెలియజేస్తోంది.


