HomeNewsAP EAPCET 2026 Counselling Schedule: జూలై 15 నుంచి కౌన్సిలింగ్? ప్రక్రియ, ఫీజులు, అవసరమైన...

AP EAPCET 2026 Counselling Schedule: జూలై 15 నుంచి కౌన్సిలింగ్? ప్రక్రియ, ఫీజులు, అవసరమైన డాక్యుమెంట్లు ఇవే

AP EAPCET 2026 Counselling Schedule: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరాలని ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అలర్ట్. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇప్పటికే అధికారులు ఈనెల 15వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు తుది కసరత్తు చేస్తున్నారు.

కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగానే అధికారిక AP EAPCET 2026 Counselling Schedule విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది? వెబ్ ఆప్షన్లు ఎలా ఇచ్చుకోవాలి? కళాశాలల్లో మారిన కొత్త ఫీజుల వివరాలు ఏమిటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాం.

AP EAPCET 2026 Counselling Schedule: ప్రక్రియ జరిగేది ఇలాగే

ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తం నాలుగు ప్రధాన దశల్లో, పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగనుంది.

1. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు (Registration & Fee):
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ వివరాలను నమోదు చేసి, నిర్ణీత కౌన్సిలింగ్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

2. సర్టిఫికేట్ వెరిఫికేషన్ (Certificate Verification):
అభ్యర్థుల పత్రాల పరిశీలన కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. ఒకవేళ డాక్యుమెంట్లలో ఏవైనా తప్పులు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే, అభ్యర్థులు వెంటనే సమీపంలోని హెల్ప్ లైన్ సెంటర్ (HLC)ను సంప్రదించాలి. సంబంధిత హెల్ప్ లైన్ సెంటర్ల జాబితా, సంప్రదింపు నంబర్లు అధికారిక కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి.

3. వెబ్ ఆప్షన్ల నమోదు (Web Options):
కౌన్సిలింగ్‌లో ఇది అత్యంత కీలకమైన దశ. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత క్రమాన్ని (Priority List) ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఎంచుకోవాలి.

4. సీట్ల కేటాయింపు & రిపోర్టింగ్ (Seat Allotment):
అభ్యర్థి సాధించిన ర్యాంక్, రిజర్వేషన్ మరియు వారు ఇచ్చుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా సంబంధిత కళాశాలకు ప్రత్యక్షంగా వెళ్లి రిపోర్ట్ చేయాలి. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

AP EAPCET 2026 Counselling Schedule

2026-27 విద్యాసంవత్సరంలో పెరిగిన ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు

ఈ విద్యాసంవత్సరం (2026-27) నుంచి ఇంజనీరింగ్ కాలేజీల కనీస ఫీజులను పెంచుతూ ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

కనీస ఫీజు పెంపు:
ప్రస్తుతం రాష్ట్రంలోని 140 ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస ఫీజును రూ.40,000 నుంచి రూ.47,000 వరకు పెంచారు.

తుది ఖరారు:
ఆంధ్రప్రదేశ్ ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ (APFRC) ఆయా కళాశాలల ఆదాయ-వ్యయాలను పరిశీలించి, రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయి కొత్త ఫీజులను ఖరారు చేయనుంది.

అమలు కాలం:
ఈ నిర్ణయించిన కొత్త ఫీజుల విధివిధానాలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాబోయే మూడేళ్ల పాటు అమలులో ఉంటాయి.

ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీలో విప్లవాత్మక కోర్స్… ఈ కోర్స్ ప్రేత్యేకత ఏంటి?

Why ANGRAU? Website: www.angrau.ac.in

For more information click this Link:  ANGRAUలో సువర్ణావకాశం: ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీలో విప్లవాత్మక కోర్స్

కౌన్సిలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు (Required Documents)

కౌన్సిలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే లోపు విద్యార్థులు క్రింది ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • ఏపీ ఈఏపీసెట్ 2026 హాల్ టికెట్ (Hall Ticket)
  • ఈఏపీసెట్ ర్యాంక్ కార్డ్ (Rank Card)
  • పదో తరగతి మార్కుల మేమో (10th Marks Memo)
  • ఇంటర్మీడియట్ మార్కుల మేమో (12th Marks Memo)
  • 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు (Study Certificates)
  • తాజా ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
  • కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (EWS Certificate – వర్తించే వారికి)
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) మరియు ఆధార్ కార్డు

అధికారిక AP EAPCET 2026 Counselling Schedule విడుదలైన వెంటనే అభ్యర్థులు కౌన్సిలింగ్ తేదీలు, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

అధికారిక వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments