HomeCinemaMirai OTT: మిరాయ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది

Mirai OTT: మిరాయ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది

Mirai OTT: థియేటర్ల బాక్సాఫీస్‌ను షేక్ చేసి, కుమ్మేసిన సినిమా మిరాయ్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుందిరా! ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని తెలిసి మనమంతా షాక్‌లో ఉన్నాం. ఒక డీసెంట్ హిట్ కొట్టింది చాలు.. ఇక ఓటీటీలో చూసుకుందాం అనుకునే వాళ్లకు ఇది నిజంగా పండగ లాంటి వార్త.

మీకు తెలుసుగా, హను-మాన్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జ చేసిన సినిమా ఇది. అందుకని ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే థియేటర్లలో ఇంకా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇంతలోనే, డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిందని జియో సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ చేసేసింది. థియేటర్లలో మిస్ అయినవాళ్లకు, మళ్లీ చూడాలనుకునే వాళ్లకు ఇది సూపర్ గుడ్ న్యూస్.

మిరాయ్ సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ (Mirai OTT)

డైరెక్టర్: కార్తిక్ ఘట్టమనేని (ఈగల్ సినిమా తర్వాత) హీరో: తేజ సజ్జ కీలక పాత్రల్లో: మంచు మనోజ్, రితికా నాయక్, శ్రీయ, జగపతిబాబు, గెటప్ శ్రీను బడ్జెట్: రూ.150 కోట్లు (సుమారుగా) బాక్సాఫీస్ కలెక్షన్లు: రూ.300 కోట్లకు పైగా (అఫీషియల్ కాకపోయినా మంచి వసూళ్లు సాధించింది)

Mirai OTT రిలీజ్ డేట్ అండ్ ప్లాట్‌ఫామ్

అంత బాగా రన్ అవుతున్న సినిమాను సడెన్‌గా #MiraiOTT ఓటీటీలోకి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చాలామంది డిసెంబర్ ఎండింగ్ వరకు రావొచ్చని అనుకున్నారు కానీ, సర్ప్రైజ్. జియో సినిమా ఈ సినిమా ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి జియో సినిమా (Jio HotStarTelugu) లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

అసలు కథ ఏంటి? (Mirai OTT)

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇది ఒక సూపర్ పవర్డ్ స్టోరీ. ఎప్పుడో అశోకుడి కాలం నాటి కథ. అశోకుడు యుద్ధాల వల్ల జరిగిన రక్తపాతానికి పశ్చాత్తాపపడి, తన శక్తులను 9 పుస్తకాల్లో దాచి, వాటికి రక్షకులను నియమిస్తాడు. కాలంతో పాటు ఆ పుస్తకాలు చేతులు మారుతూ వారి వారసుల ద్వారా రక్షింపబడుతూ ఉంటాయి.

ఇప్పుడు, ఈ పుస్తకాల గురించి తెలిసిన మహావీర్ లామా అనే విలన్ వాటిని సొంతం చేసుకోవాలని చూస్తాడు. అప్పటికే అతనికి 8 పుస్తకాలు దొరుకుతాయి. ఇంకో ఒక పుస్తకం కోసం వేట మొదలుపెడతాడు. అయితే, ఆ పుస్తకం గురించి తెలిసిన అంబిక అనే ఆవిడ దానిని ఓ తెలియని ప్రదేశంలో దాచిపెడుతుంది. ఆ సమాచారం తన కొడుకుకు మాత్రమే తెలిసేలా చేసి చనిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? లామా మిగిలిన పుస్తకాన్ని సాధించుకున్నాడా? అంబిక కొడుకు ధీర అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ కథకు రామాయణంతో ఉన్న లింక్ ఏంటి? అసలు మిరాయ్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ సినిమా చూస్తేనే తెలుస్తాయి.

మిరాయ్ సినిమా ఎందుకు చూడాలి? (Mirai OTT)

1. పర్‌ఫెక్ట్ యాక్షన్ అండ్ విజువల్స్: సినిమా మొత్తం మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో కట్టిపడేస్తుంది. యాక్షన్ సీన్స్ అయితే థియేటర్లలో చూడటమే ఒక ఎక్స్‌పీరియన్స్. కచ్చితంగా ఇది మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది.

2. తేజ సజ్జ అండ్ మంచు మనోజ్ పర్‌ఫామెన్స్: తేజ సజ్జ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అండ్ మంచు మనోజ్ యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. వీరిద్దరూ అదరగొట్టేశారు.

3. రామాయణం లింక్: సినిమా కథకు రామాయణంతో లింక్ పెట్టి తీసిన విధానం చూసే వాళ్ళకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ కాన్సెప్ట్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది.

4. ఎంగేజింగ్ కథనం: కథ పర్వాలేదు అనిపించినా, దానిని చూపించిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. కార్తిక్ ఘట్టమనేని టేకింగ్ కూడా ఈ సినిమాకు ఒక ప్లస్.

ఓవరాల్‌గా, థియేటర్లలో మంచి హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు #Mirai ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకెందుకు లేట్? జియో సినిమాలో #JioHotstar చూడటానికి రెడీగా ఉండండి.

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments