OG OTT: థియేటర్లో పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద చూస్తే వచ్చే పూనకాలు మామూలుగా ఉండవు కదా! ఆ రష్, ఆ ఫీల్ మళ్ళీ కావాలంటే ఇప్పుడు సింపుల్ గా ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు! అవును, థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన “OG Cinema OTT” అప్‌డేట్ వచ్చేసింది.
ఇంతకీ ఎప్పుడు? ఎక్కడ? ఎందుకని ఈ సినిమాని మళ్ళీ చూడాలి? మొత్తం డీటెయిల్స్ చూద్దాం పదండి!
OG OTT Release Date
ఫ్రెండ్స్, మన “OG” సినిమా నెట్‌ఫ్లిక్స్లో గ్రాండ్ గా ల్యాండ్ అవుతోంది. అక్టోబర్ 23 నుంచి తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా “OG Streaming” అవుతుంది. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ఇది మామూలు వెర్షన్ కాదు! ఎక్స్‌టెండెడ్ కట్ తో వస్తోంది. అంటే, థియేటర్లో మనం మిస్ అయిన కొన్ని సీన్స్, ఎక్స్‌ట్రా విజువల్స్ తో సినిమా ఓ రేంజ్ లో ఉండబోతోంది.
ఈ OTT Release విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “Pawan Kalyan” ఫ్యాన్స్ ఈ అప్‌డేట్ తో మళ్ళీ పూనకాలు లోకంలోకి వెళ్ళిపోయారు.
ఎందుకు చూడాలి? (Why to Watch OG – OG OTT)
ఇప్పటికే థియేటర్లలో చూసేసిన వాళ్ళు కూడా #OG ని మళ్ళీ ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ రావచ్చు. దానికోసం కొన్ని సింపుల్ రీజన్స్ చెప్తా.
- పవన్ కళ్యాణ్ స్వాగ్: పవర్ స్టార్ ని ఇంత స్టైలిష్ గా, మాస్ గా చూపించిన సినిమా రీసెంట్ గా ఏదీ లేదు. ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, స్వాగ్ వేరే లెవల్. ఈ ఒక్క రీజన్ చాలు సినిమాని మళ్ళీ చూడ్డానికి.
- సుజిత్ మార్క్: సాహో తర్వాత దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. తన స్టైలిష్ మేకింగ్, ఎలివేషన్ సీన్స్ #OG ని కొత్తగా చూపించాయి.
- యాక్షన్ సీక్వెన్సెస్: సినిమాలోని ప్రతి యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ, గ్యాంగ్ లతో ఫైట్ చేసే సీక్వెన్సెస్ మాస్ ఆడియన్స్ ని పిచ్చెక్కించాయి.
- థమన్ మ్యూజిక్: SS థమన్ మ్యూజిక్ లేకపోతే #OGMovieని ఊహించుకోవడం కష్టమే. ప్రతి ఎలివేషన్ సీన్ కి థమన్ ఇచ్చిన బీజీఎం మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడింది.
సినిమా స్టోరీ ఏంటి? (OG Story – OG OTT)
ఓ జపాన్లో యుద్ధ విద్యలు నేర్చుకున్న కుర్రాడు గంభీర. తన ఫ్యామిలీని అంతం చేసిన వారిని మట్టుబెట్టడం కోసం ముంబైకి వెళ్తాడు. అక్కడ దాదా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అతని సాయంతో ముంబై మాఫియాని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. ఒకరోజు సడన్ గా దాదా పెద్ద కొడుకు చనిపోవడం, ఆ తర్వాత గంభీర కనిపించకుండా పోవడం జరుగుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి మాఫియా మీద కంట్రోల్ కోసం ఓమీ అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతను గంభీరని ఎదుర్కోవడానికి ట్రై చేస్తాడు. ఇంతకీ గంభీర ఎందుకు మాయమయ్యాడు? అతనికి, దాదా ఫ్యామిలీకి మధ్య ఏం జరిగింది? అసలు గంభీర బ్యాగ్రౌండ్ ఏంటి? ఓమీని అతను ఎలా ఎదుర్కున్నాడు అనేది సినిమా స్టోరీ.
OG హైలైట్స్ (OG Movie Highlights – OG OTT)
- పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ కరిష్మా, ఆటిట్యూడ్ సినిమాకి మెయిన్ హైలైట్.
- తమన్ BGM: థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది.
- స్క్రీన్ ప్లే: సుజిత్ రైటింగ్ అండ్ డైరెక్షన్ సినిమాని చాలా ఫాస్ట్ గా, ఎంగేజింగ్ గా నడిపించాయి.
- క్యాస్టింగ్: పవన్ కళ్యాణ్ తో పాటు, ప్రియాంకా మోహన్, శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ వంటి నటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి.
ఎక్స్‌టెండెడ్ కట్: వాట్ టు ఎక్స్‌పెక్ట్?
“OG Movie OTT”లో వచ్చే ముఖ్యమైన అట్రాక్షన్ ఈ ఎక్స్‌టెండెడ్ కట్. థియేటర్లలో రన్ టైం ని బట్టి కొన్ని సీన్స్ కట్ చేయడం మామూలే. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్లో వచ్చే వెర్షన్ లో అవి అన్నీ యాడ్ అవుతాయి. దీనివల్ల సినిమా స్టోరీ మరింత క్లారిటీగా, ఎంగేజింగ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద ట్రీట్.
వార్నింగ్! (Warning – OG OTT)
సినిమాలో యాక్షన్, ఎలివేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో హింసాత్మక సన్నివేశాలు కూడా ఉన్నాయి. సో, ఫ్యామిలీతో చూసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండేటప్పుడు జాగ్రత్త పడండి.
OG సినిమా నెట్‌ఫ్లిక్స్ లో వస్తుందని తెలియగానే మీ ఫ్రెండ్స్ కి ఈ అప్‌డేట్ షేర్ చేయండి. వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూస్తారు.
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


