Tips for Eye health and maintaining good eyesight naatv
Spread the love

How to Keep Your Eyes Healthy

Eyesight/Eye Health సర్వేంద్రియానాం నయనం ప్రధానం… కంటి చూపు లేకపోతే అంతా చీకటే. జీవితం శూన్యం. మరి అంత విలువైన కంటి చూపుని, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎం చెయ్యాలి? చిన్న వయసులోనే కంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆలా రాకుండా ఉండాలంటే ఎం చెయ్యాలి? డేగ లాంటి తీక్షణమైన చూపు (Eagle’s Eye) మన కళ్ళకి ఉండాలంటే ఎం చెయ్యాలి? ఎం తింటే మన కళ్ళకి ఆ శక్తి వస్తుంది. కంటి సమస్యలు తెచ్చుకుని, కళ్ళజోడు వాడే కంటే ముందు జాగ్రత్తతో ఉంటూ, చిన్నపాటి ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకుంటే డేగ లాంటి తీక్షణమైన చూపు మన సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

01. క్యారెట్ (Carrot)

కంటి చూపు అద్భుతంగా ఉండాలన్నా, కంటిలోని ఇతర భాగాలూ అద్భుతంగా పనిచేయాలన్నా, విటమిన్ ఏ (Vitamin A) అవసరం. దానికోసం ప్రథమంగా చెప్పాల్సింది, తినాల్సింది బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉన్న క్యారెట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది.

02. ఆకు కూరలు (Green leafy vegetables-spinach, kale, and collards)

తోటకూర, పాలకూర, బచ్చలి, పాలకూర ఇతర ఆకు కూరలు పోషకాలకు నిలయం. ఆకు కూరలు కంటి ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.

03. చేపలు (Fishes)

ఒమేగా-3 (omega 3) చేపలతో పుష్కలంగా ఉంటుంది. కంటి కణజాలం, కణాల నిర్మాణం, వృద్ధికి, పొడి కాళ్ళ సమస్యకు దివ్య ఔషథం.

04. పండ్లు (Oranges and other citrus fruits)

నిమ్మ, నారింజ, బత్తాయి లలో విటమిన్ సి (Vitamin C) సమృద్ధిగా దొరుకుతుంది. కంటి సమస్యలను నివారించడంలో, కాంతిని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

05. గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు (Eggs, nuts, beans)

విటమిన్ ఈ (Vitamin E) పుష్కలంగా ఉన్న అవిసె గింజలు, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుడ్లు, తీసుకోవాలి, వీటిలో ఉంటె యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి కంటి కణజాలాన్ని రక్షించే రక్షణ కవచం. వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి.

తరచుగా కనిపించే కంటి సమస్యలు (Common/Regular Eye Problems):

  1. కంటి శుక్లాలు (cataracts)
  2. మబ్బు మబ్బు గ కనిపించడం (Blurry vision)
  3. దూరం లేదా దగ్గరి చూపు మందగించడం (Trouble focusing at a distance)
  4. పొడి కళ్ళు (Dry Eyes)
  5. తలనొప్పులు (Headaches)
  6. మెడ, వెన్ను మరియు భుజం నొప్పి (Neck, back, and shoulder pain)
  7. గ్లకోమా (glaucoma)
  8. కంటిపై ఒత్తిడి (Eyestrain), కంటి నరాలు బలహీనపడడం

నాటీవీ తెలుగు ఏమి చెప్పునా మీరు బాగుండాలనే, సహజంగా వయసు పెరిగే కొద్దీ కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు చర్యలు తీసుకోవటం కంటే, ముందు జాగ్రత్త అవసరం. అందుకని, క్రమంతప్పకుండా పైన చెప్పిన ఆహరం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించండి.

జాగ్రత్తలు (Precautions): Tips for Good Eye health and eyesight

  1. బాగా తినండి (Eat Well)
  2. ధూమపానం మానేయండి (Quit/Stop Smoking)
  3. సన్ గ్లాసెస్ ధరించండి (Wear Sunglasses)
  4. సేఫ్టీ ఐవేర్ ఉపయోగించండి (Use Safety Eyewear)
  5. కంప్యూటర్ స్క్రీన్ (Computer Screen), మొబైల్ స్క్రీన్ (Mobile Screen), టీవీ స్క్రీన్ (TV Screen), మొబైల్ ట్యాబ్ స్క్రీన్ (Tab Screen) నుండి దూరంగా చూడండి (Look Away from the Computer Screen)
  6. చిన్న, పెద్ద అని తేడాలేకుండా మీ కంటి వైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించండి (Visit Your Eye Doctor Regularly)
  7. గ్లకోమా (glaucoma), కంటిపై ఒత్తిడి (Eye pressure), కంటి నరాల పరీక్షలు (optic nerve tests to check) రెగ్యులర్ గా చెకప్ (microscopic examination) చేయించుకోవాలి.
  8. కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు గడిపేవారు, యాంటీ గ్లేర్ గ్లాసులు (anti-glare screen) వాడండి, ప్రతి 20 నిముషాలకి ఒకసారి చూపు ప్రక్కకు మరల్చి, దూరంగా ఉండే (సుమారు 20 అడుగులు) వస్తువులను, ప్రదేశాలను, ప్రకృతిని చూడటం మంచిది. ప్రతి 2 గంటలకి ఒకసారి 15 నిముషాలు కంటికి విశ్రాంతి ఇవ్వడం మంచిది.
  9. కంటికి చల్లని నీటితో కడగటం వలన కంటిపై , నరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
  10. కంటి మీద చల్లని తడి గుడ్డ ఉంచితే ఇంకా మంచిది.

మీ కంటి ఆరోగ్యం మీరు తినే కంచం లోనే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.

subscribe-naatv-telugu-yout


Spread the love