HomeCinemaChiranjeevi Tweet On Irumudi: మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్: ‘ఇరుముడి’ విజయంపై ప్రశంసలు... ఇండస్ట్రీకి...

Chiranjeevi Tweet On Irumudi: మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్: ‘ఇరుముడి’ విజయంపై ప్రశంసలు… ఇండస్ట్రీకి గట్టి చురకలు!

Chiranjeevi Tweet On Irumudi: తెలుగు చిత్రసీమలో ఒక సినిమా విజయం సాధిస్తే అభినందనలు వెల్లువెత్తడం సహజమే. కానీ, మెగాస్టార్ చిరంజీవి ‘ఇరుముడి’ సినిమా విజయంపై చేసిన ఒక ట్వీట్ మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తోంది.

కేవలం అభినందనలకే పరిమితం కాకుండా, ఆయన రాసిన కొన్ని వ్యాఖ్యలు (Chiru Tweets) టాలీవుడ్‌లో కొత్త సమరానికి లేదా లోతైన విశ్లేషణకు దారితీస్తున్నాయి.

మెగాస్టార్ ఆసక్తికరమైన పోస్ట్ (Chiranjeevi Tweet On Irumudi):

చిరంజీవి తమ ‘తమ్ముడు’ రవితేజ నటనను, దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగ చిత్రీకరణను, బేబీ నక్షత్ర సహా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ గుప్తాలను మనస్ఫూర్తిగా అభినందించారు. అయితే అంతటితో ఆగకుండా తెలుగులో ఆయన రాసిన రెండు వాక్యాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి:

“ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి! #LiveAndLetLive”

చిత్రసీమలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను, లేదా థియేటర్ల వ్యవస్థ, కాంపిటీషన్, అలాగే కొందరి గుత్తాధిపత్యాన్ని ఉద్దేశించే చిరంజీవి ఈ రకమైన పదునైన వ్యాఖ్యలు (Chiranjeevi Tweet On Irumudi Team) చేశారని ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, ప్రతీ ఒక్కరూ ఎదగాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ “Live and Let Live” పిలుపునిచ్చినట్లు అర్థమవుతోంది.

Ravi Teja and Mythri Movie Makers, Director Shiva Nirvana replied to Megastar Chiranjeevi tweet on Irumudi

చిత్ర యూనిట్ భావోద్వేగ స్పందనలు:

మెగాస్టార్ అభినందనల పట్ల ‘ఇరుముడి’ టీమ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ రీ-ట్వీట్లు చేసింది:

  • రవితేజ: చిరంజీవి ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ, “అన్నయ్యా… థాంక్యూ సో మచ్” అని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
  • దర్శకుడు శివ నిర్వాణ: “చిరంజీవి సర్, మీ మాటలు నాకు ఎంతో అమూల్యం. మీలాంటి వారి నుంచి వచ్చిన ఈ ప్రశంస నిజంగా నన్ను భావోద్వేగానికి గురిచేసింది. ఇరుముడి ఆత్మను మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ సంతోషం పంచుకున్నారు.
  • మైత్రి మూవీ మేకర్స్: “థాంక్యూ సో మచ్… మెగాస్టార్ గారు. మీ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన ప్రశంస ఇరుముడి టీమ్‌కు ఎంతో ప్రత్యేకమైనది” అని పేర్కొన్నారు.

మొత్తానికి ‘ఇరుముడి’ సినిమా విజయంతో పాటు మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పదునైన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు తెరలేపాయి. గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ ఇండస్ట్రీలో అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలనే సంకేతాన్ని చిరంజీవి తన పోస్ట్ ద్వారా స్పష్టంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు.

Irumudi Movie Review: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రివ్యూ

RELATED ARTICLES

Most Popular

Recent Comments