Renukaswamy Murder Case Update – అసలేం జరిగిందంటే:
- దాడి తీవ్రత: పవిత్ర గౌడకు మెసేజ్‌లు పంపినందుకు రేణుకాస్వామిని దర్శన్ తీవ్రంగా బూతులు తిడుతూ కొట్టారు. ఆ దెబ్బలకు రేణుకాస్వామి తల పగిలి రక్తం కారింది. ఆ తర్వాత పవిత్రను అక్కడికి పిలిపించి చెప్పుతో కొట్టించారు.
- చిత్రహింసలు: అంతటితో ఆగక రేణుకాస్వామికి లోదుస్తులు మాత్రమే ఉంచి, టాటా ఏస్ వాహనానికి వేలాడదీసి నైలాన్ తాడుతో కంటిన్యూగా కొట్టారు.
- చంపేంత వరకు వదల్లేదు: “ఇలా కొడితే చనిపోతాడు” అని ప్రదోష్ వారించినా ఎవరూ వినలేదు. రేణుకాస్వామికి కొద్దిగా నీళ్లు, తిండి ఇచ్చిన వెంటనే దర్శన్ మళ్లీ వచ్చి అతని ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నారు. దాంతో అతను స్పృహతప్పి పడిపోగా, దర్శన్ తన రెండు కాళ్లతో అతని ఛాతీని తొక్కేందుకు యత్నించారు. ప్రదోష్ అడ్డుకునేలోపే రేణుకాస్వామి ప్రాణాలు పోయాయి.
- కేసును నీరుగార్చే కుట్ర: అతను చనిపోయాడని తెలిశాక దర్శన్ భయపడిపోయి, “ఈ విషయాన్ని ఇక్కడే సద్దుమనిగేలా చెయ్యకపోతే తుపాకీతో కాల్చుకుని చచ్చిపోతా” అని ప్రదోష్‌ను బెదిరించారు. ఆ తర్వాతే పోలీసులు దారి మళ్లించేందుకు ఒక కల్పిత కథను అల్లారు.
సాక్ష్యాలను తారుమారు చేసిన విధానాన్ని పూర్తిగా కోర్టుకు వివరించిన ప్రదోష్, తనకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


