HomeNewsRajahmundry Medico Priyanka: యాక్సిడెంట్ కేసులో రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి!

Rajahmundry Medico Priyanka: యాక్సిడెంట్ కేసులో రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి!

Rajahmundry Medico Priyanka passed away: రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన ఆమె కుటుంబంతో పాటు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Rajahmundry Medico Priyanka Case అసలేం జరిగింది?

ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజమహేంద్రవరంలో పీజీ చదువుతున్న ప్రియాంక, ఆగస్టు 3న రాత్రి తన స్నేహితురాలితో కలిసి ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద సినిమా చూసి బయటకు వచ్చారు. ట్రాఫిక్ ఉండటంతో రోడ్డుపై స్కూటీ ఆపి వేచి చూస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి.

Rajahmundry Medico Priyanka ఆస్పత్రిలో పోరాటం:

ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను రాజమహేంద్రవరంలో చేర్పించినా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడిన ప్రియాంకను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా యత్నించారు. పరిస్థితి క్షీణించి, బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆదివార మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

నిందితులు & పోలీసుల చర్యలు:

  • ప్రమాద సమయంలో కారులో సురవరపు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
  • ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
  • మొదట ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసినప్పటికీ, దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా సెక్షన్లను మార్చారు.
  • ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తేలితే, ప్రస్తుతం ఉన్న ‘హత్యాయత్నం’ కేసును ‘హత్య’ కేసుగా మారుస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ స్పష్టం చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఎక్లాస్‌పూర్‌కు చెందిన ప్రియాంక, వైద్యురాలై ఎంతో మందికి సేవ చేయాలని కన్న కలలు ఈ ప్రమాదంతో కల్లలయ్యాయి. తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి వెంకటేష్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి :
RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments