HomeCinemaCM Vijay Sangeetha Divorce Case: తమిళనాడు సీఎం విజయ్-సంగీత విడాకుల కేసులో సంచలన మలుపు..

CM Vijay Sangeetha Divorce Case: తమిళనాడు సీఎం విజయ్-సంగీత విడాకుల కేసులో సంచలన మలుపు..

CM Vijay Sangeetha Divorce Case: తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీతల విడాకుల వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంగీత ప్రకటించడంతో చెంగల్‌పట్టు కుటుంబ సంక్షేమ కోర్టు ఈ కేసును ముగించింది.

గత ఫిబ్రవరిలో విజయ్‌కి వేరే నటితో బంధం ఉందంటూ, మానసిక క్షోభకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో సంగీత కోర్టుకెక్కారు. పరిపరి విధాలుగా విడాకుల ప్రాసెస్ నడుస్తున్న సమయంలో రూ. 250 కోట్ల భరణం డిమాండ్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రత్యర్థులు దీనిపై రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు చేశారు.

అయితే, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇద్దరి మధ్య మాట్లాడి రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కోర్టు విచారణలో పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు సంగీత నేరుగా చెప్పడంతో, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లన్నింటికీ ముగింపు పడింది.

CM Vijay Sangeetha Divorce Case కోర్టు నిర్ణయం:

సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించింది. భవిష్యత్తులో అవసరమైతే ఆమె మళ్లీ కొత్త పిటిషన్ వేసుకునే స్వేచ్ఛను కోర్టు కల్పించింది.

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments